Green card: అమెరికా సంచలన నిర్ణయం.. గ్రీన్‌కార్డు దరఖాస్తుకు స్వదేశాలకు వెళ్లాల్సిందే

అమెరికాలో గ్రీన్‌కార్డు పొందాలనుకునే తాత్కాలిక వలసదారులకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ బిగ్ షాకిచ్చింది. ఇకనుంచి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తులు సమర్పించాలంటే తాత్కాలిక విదేశీయులు కచ్చితంగా తమ స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది.

New Update
US green card applicants will now have to return to their home countries to apply

US green card applicants will now have to return to their home countries to apply

అమెరికాలో గ్రీన్‌కార్డు పొందాలనుకునే తాత్కాలిక వలసదారులకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ బిగ్ షాకిచ్చింది. ఇకనుంచి గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తులు సమర్పించాలంటే తాత్కాలిక విదేశీయులు కచ్చితంగా తమ స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. అమెరికా వలస చట్టాల అసలు ఉద్దేశాన్ని రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్‌ ప్రతినిధి జాక్‌ కహ్లర్‌ తెలిపారు. దీంతో పాలసీ మెమోను సంస్థ రిలీజ్ చేసింది. విద్యార్థులు, టూరిస్టులు, తాత్కాలిక కార్మికులు తమ గడువు ముగిసిన వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని, అమెరికా పర్యటనను గ్రీన్‌కార్డు పొందడం కోసం తొలి అడుగుగా మార్చుకోకూడదన్నదే దీని ఉద్దేశమని పేర్కొన్నారు. 

Also Read: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్... వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్..ఎందుకో తెలుసా?

అసాధారణ, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అమెరికా నుంచే హోదా మార్పు  కోసం అప్లై చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఇలాంటి మినహాయింపుల కోసం దరఖాస్తు చేసే వాళ్ల పత్రాలను అధికారులు క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని నూతన మార్గదర్శకాలు వెల్లడించాయి. ఈ విధానం వల్ల వలస వ్యవస్థలోని లోపాలను నివారించవచ్చని యూఎస్‌సీఐఎస్‌ భావిస్తోంది. అలాగే గ్రీన్‌కార్డు దరఖాస్తులు తిరస్కరణకు గురైనా కూడా అమెరికాలోనే అక్రమంగా ఉండిపోయే వాళ్లని గుర్తించి, దేశం దాటించే శ్రమ కూడా అధికారులకు తప్పుతుందని జాక్‌ కహ్లర్‌ స్పష్టం చేశారు. 

Also Read: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్... వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్..ఎందుకో తెలుసా?

ఇక యూఎస్‌సీఐఎస్‌ తీసుకుంటున్న చర్యల వల్ల హెచ్‌-1బీ వీసా దరఖాస్తులపై స్పష్టంగా కనిపిస్తోంది. సంస్థ కఠినత్వం కారణంగా 2027 ఆర్థిక సంవత్సరానికి గానూ H1బీ వీసా దరఖాస్తుల సంఖ్య ఏకంగా 38.5 శాతం వరకు తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో 3,43,981 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే కేవలం 2,11,600  దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. వీసాలను ఆమోదించే విషయంలో కూడా ఉన్నత విద్యార్హతలు, అలాగే అధిక వేతనాలు పొందే అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. 

Advertisment
తాజా కథనాలు