/rtv/media/media_files/2026/06/11/fotojet-6-2026-06-11-13-03-40.jpg)
ఒమన్ గల్ఫ్‌లో భారత నౌకపై అమెరికా దాడికి పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉండగా.. అందులో 21 మందిని రక్షించారు. ఆదేశాలను పాటించకపోవడం వల్ల దాడి చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. అయితే ఈ ట్యాంకర్ ఇరాన్ నుంచి చమురు కూడా తీసుకువస్తున్నట్లు వెల్లడించింది.
🚨Another commercial vessel with Indian sailors on board attacked in Hormuz Strait
— Sputnik India (@Sputnik_India) June 11, 2026
MT Jalveer has come under attack off the Oman coast.
The incident comes just one day after another attack on a commercial tanker off Oman left three Indian seafarers dead. pic.twitter.com/Ln65uPkkr0
దీనివల్ల తమ యుద్ధ విమానం ద్వారా నౌక ఇంజిన్ గదిపై ఖచ్చితమైన క్షిపణి దాడి చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. దాడి జరిగిన వెంటనే ఓడలో మంటలు చెలరేగి, నీటిలోకి మునిగిపోయింది. నౌకలో ఉన్న నావికులు వెంటనే కాపాడమన్నా అమెరికా స్పందించలేదు. అయితే ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని అమెరికా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌ను పిలిపించి.. గట్టిగా నిరసన తెలిపింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది.
ఇది కూడా చూడండి:Neethu Bhai : ఐటీ కారిడార్‌లో ‘గంజాయి సామ్రాజ్యం’.. మరోసారి తెరమీదకు "నీతూబాయ్'
Three missing Indian seafarers dead after US strike on tanker off the coast of Oman – Indian Shipping Minister pic.twitter.com/GIOBw0BZz4
— TRT World Now (@TRTWorldNow) June 11, 2026
Follow Us