Iran: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం.. ఇరాన్‌లో 30 పైగా యూనివర్సిటీలు ధ్వంసం

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రోజురోజుకు మండుతున్నాయి. ఫిబ్రవరి 28న మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరుపుతున్న వైమానిక దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్‌లోని 30కి పైగా యూనివర్సిటీలో తీవ్రంగా దెబ్బతిన్నాయి.

New Update
Universities hit as US, Israel ramp up attacks on Iran’s infrastructure

Universities hit as US, Israel ramp up attacks on Iran’s infrastructure

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రోజురోజుకు మండుతున్నాయి. ఫిబ్రవరి 28న మొదలైన ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై జరుపుతున్న వైమానిక దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్‌లోని 30కి పైగా యూనివర్సిటీలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని ఆ దేశ సైన్స్ మంత్రి హొస్సేన్ సిమై సర్రాఫ్ వెల్లడించారు. తాజాగా ఉత్తర టెహ్రాన్‌లో ఉన్న ‘షాహిద్ బెహెష్తీ యూనివర్సిటీ’తో పాటు మెహ్రాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడుల్లో కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.

ఇరాన్‌లోని యూనివర్సిటీలపై జరుగుతున్న ఈ దాడులు వేలాది మంది విద్యార్థులు, పరిశోధకుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. విద్యాలయాలతో పాటు వైద్య కేంద్రాలు, ఆస్పత్రులపై కూడా దాడులు జరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.  బయోమెడికల్ కేంద్రమైన ‘పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇరాన్’పై కూడా బాంబు దాడులు జరిగడం సంచలనం రేపింది. అక్కడున్న భవనాలు దెబ్బతిన్నప్పటికీ.. అత్యవసర సేవలు, వ్యాక్సిన్ల ఉత్పత్తిని సిబ్బంది కొనసాగిస్తున్నట్లు ఇరాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

Also Read: హర్మూజ్‌ దాటిన గ్రీన్ ఆష.. భారత్‌కు చేరిన 9వ LPG నౌక

అయితే పౌర ఆరోగ్య కేంద్రాలను టార్గెట్ చేసుకొని దాడులు చేయడం అనేది అంతర్జాతీయ మానవతా చట్టాల ఉల్లంఘించినట్లే అవుతుందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇరాక్, లెబనాన్, సిరియా లాంటి పొరుగు దేశాలకు కూడా విస్తరించింది. 

ఈ భీకర దాడుల్లో ఇప్పటిదాకా 3 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 30 వేల మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 40 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చివరికి విదేశాలకు వలసబాట పట్టారు. పశ్చిమాసియాలో ఆరోగ్య వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. దీంతో వీటని ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం తక్షణమే స్పందించాలని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు జరపాలని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.

Also Read: ప్రపంచ రికార్డు.. 864 గంటల పాటు చీకట్లో ఇరాన్ ఇంటర్‌నెట్ లోకం!

Advertisment
తాజా కథనాలు