/rtv/media/media_files/2025/01/19/f8J5nAad2q0OH8ODxl4M.jpg)
chandra babu and Amit Shah
ఏపీలోని విజయవాడ సమీపంలో కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భవ వేడుకల్లో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్ క్యాంపస్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు. '' వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా ధ్వంసం చేసిందో అందరికీ తెలిసిందే. అప్పటి విధ్వంసం గురించి ఎవరూ చింతించకండి. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ సపోర్ట్ ఉంటుది. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో మూడింతల ప్రగతి సాధిస్తాం.
Also Read: 'నా కొడుకుకి మరణశిక్ష విధించండి': సంజయ్ రాయ్ తల్లి
6 నెలల్లో ఏపీకి రూ.3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించాం. గత ప్రభుత్వం రాజధాని అమరావతిని నిర్లక్ష్యం చేసింది. హడ్కో ద్వారా అమరావతికి రూ.27 వేల కోట్ల సాయం అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరంపై చంద్రబాబుపై చర్చలు జరిపాను. 2028లోపే ఏపీకి పోలవరం నీళ్లు అందిస్తాం. విశాఖ రైల్వేజోన్‌ను సైతం పట్టాలెక్కించామని'' అమిత్ షా అన్నారు.
ఎన్ డి ఆర్ ఎఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా తో కలిసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ కూడా హాజరయ్యారు.#AndhraPradesh pic.twitter.com/vWYzg2pRVU
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 19, 2025
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ '' కేంద్రం అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. అలాగే పోలవరం డయాఫ్రమ్ పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో 2027 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. విశాఖ రైల్వేజోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు కోసం కేంద్రం మద్దతు ఇవ్వాలి. గతంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎన్‌ఐడీఎం కోసం టీడీపీ ప్రభుత్వం భూములు ఇచ్చింది. ఈరోజు కేంద్రం సాయంతో వాటిని పూర్తి చేశామని'' అన్నారు.
Also Read: కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణ భయంతో భక్తుల పరుగులు!
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కూడా మాట్లాడారు. గ్రామస్థాయిలో కూడా విపత్తు నిర్వహణ బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. '' ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటాం. గత ప్రభుత్వ విపత్తు నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోగలిగాం. కూటమి పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. గత ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందిస్తున్న సహకారం మరువలేనిదని'' పవన్ కల్యాణ్ అన్నారు.