/rtv/media/media_files/2026/03/19/drones-2026-03-19-13-49-15.jpg)
Unidentified drones were spotted over a U.S. military base in Washington
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా రక్షణ, విదేశాంగ విధాన నిర్ణేతలు ఉండే కీలకమైన సైనిక స్థావరాల భూభాగంలో అనుమానస్పద డ్రోన్లు కనిపించాయి. దీంతో వైట్‌హౌస్ అలెర్ట్ అయ్యింది. అమెరికా రక్షణ వలయాన్ని ఇరాన్ చొచ్చుకొని వచ్చిందనే ప్రచారం నడుస్తోంది.
అసలు ఏం జరిగింది ?
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఫోర్ట్ లెస్లీ జె.మెక్‌నైర్ సైనిక స్థావరం దగ్గర్లో గుర్తుతెలియని డ్రోన్లు కనిపించాయి. ఈ ప్రాంతంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్స్త్ లాంటి వారు ఇక్కడే ఉంటారు. ఇలాంటి ప్రదేశంలో డ్రోన్లు సంచరించడం దుమారం రేపుతోంది. డ్రోన్ల ముప్పు నేపథ్యంలో మాక్‌డిల్ ఎయిర్ ఫోర్స్ బేస్, జాయింట్ బేస్ మెక్‌గైర్-డిక్స్-లేక్‌హర్స్ట్ వద్ద భద్రతా స్థితిని "చార్లీ" స్థాయికి పెంచేశారు. ఏదైన ఉద్రదాడులు జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి స్థాయికి భద్రతను పెంచుతారు. అనుమానస్పద డ్రోన్ల సంచరించడంపై వైట్‌హౌస్‌లో జాతీయ భద్రతా సలహాదారులు, ఉన్నతాధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. కీలక నేతలను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: అమెరికాకు బిగ్ షాక్.. విదేశాల నుంచి దిగుమతులు.. స్థానిక కరెన్సీల్లోనే చెల్లింపులు
డ్రోన్లు తిరగడం వెనుక ఇరాన్ హస్తం ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇతర కీలక నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. దూంతో తాము అమెరికా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు చేస్తూనే ఉంది. అందుకే ఇందులో ఇరాన్ ప్రమేయం ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది.
అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలకు అమెరికా విదేశాంగ శాఖ '''వరల్డ్ వైడ్ సెక్యూరిటీ అలర్ట్''ను జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి ?, ఎవరు ఆపరేట్ చేస్తున్నారు ? అనే దానిపై FBI అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: చైనాకు బిగ్ షాక్.. అమెరికా గ్రీన్ సిగ్నల్‌తో భారత్ వైపుకు 7 రష్యా చమురు నౌకలు
ఓవైపు ఖతార్‌లోని రాస్ లఫాన్‌పై దాడులు, మరోవైపు అమెరికాలోని కీలక నాయకుల నివాసాల వద్ద డ్రోన్లు సంచరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో యుద్ధం మరింత ముదిరుతున్నట్లు కనిపిస్తోంది. ఇది కేవలం అంతర్జాతీయ ఇంధన ధరల మీదే కాకుండా.. ప్రపంచ భద్రతా సమీకరణలు కూడా మార్చే అవకాశం ఉంటుంది.
Follow Us