Ukraine: ఆయుధాల దిగుమతిలో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉక్రెయిన్ !

2020 నుంచి 2024 మధ్య ప్రపంచ ఆయుధాల దిగుమతి షేర్‌లో ఉక్రెయిన్‌ 8.8 శాతంతో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలోకి వచ్చింది. 8.3 శాతంతో భారత్‌ రెండోస్థానంలో ఉంది. పూర్తి సమాచారం కోసం ఆ ఆర్టికల్ చదవండి.

New Update
Ukraine replaces India as world's largest arms importer

Ukraine replaces India as world's largest arms importer

దేశ రక్షణ కోసం ప్రస్తుతం చాలా దేశాలు డిఫెన్స్‌ రంగంలో భారీగా నిధులు కేటాయిస్తున్నాయి. పలు దేశాలు సొంతంగా ఆయుధాలు తయారుచేసుకుంటే మరికొన్ని దేశాలు విదేశాల నుంచి భారీగా వాటిని దిగుమతి చేసుకుంటున్నాయి. అయితే ప్రపంచంలోనే ఎక్కువ ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశంగా భారత్‌ మొదటి స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు ఉక్రెయిన్‌.. భారత్‌ను వెనక్కి నెట్టి టాప్‌ ప్లేస్‌లోకి వెళ్లిపోయింది. 
2020 నుంచి 2024 మధ్య ప్రపంచ ఆయుధాల దిగుమతి షేర్‌లో ఉక్రెయిన్‌ 8.8 శాతంతో మొదటి స్థానంలో ఉంది. 8.3 శాతంతో భారత్‌ రెండోస్థానంలో ఉంది. 6.8 శాతంతో ఖతర్‌ మూడో స్థానంలో ఉండగా, సౌదీ అరేబియా కూడా 6.8 శాతంతో నాలుగో ర్యాంక్‌లో ఉంది. ఇక పాకిస్థాన్ 4.6 శాతంతో అయిదవ స్థానంలో ఉంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసేర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (SIPRI) అనే సంస్థ తన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది.  

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావమే

ఉక్రెయిన్ 2014 నుంచి 2019తో పోలిస్తే.. 2020-24కి ఏకంగా100 రేట్లు ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకున్నట్లు సిప్రీ (SIPRI) తన నివేదికలో తెలిపింది. 2022 ఫిబ్రవరి 22 ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో రష్యా దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఈ తరుణంలోనే ఉక్రెయిన్‌ పెద్ద ఎత్తున ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అయితే 2019 నుంచి 2023 మధ్య ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశంగా భారత్‌ ఉన్నట్లు సిప్రీ తెలిపింది. ప్రపంచ ఆయుధాల దిగుమతి షేర్‌లో 9.8 శాతంతో ఇండియా మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.  
ఆ సమయంలో భారత్, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్‌..పెద్ద ఆయుధానలు దిగుమతి చేసుకుంది. అయితే 2015-19, అలాగే 2020-24 మధ్య భారత్‌లో ఆయుధాల దిగుమతి 9.3 శాతం తగ్గిపోయినట్లు నివేదిక తెలిపింది. భారత్‌ సొంతగా ఆయుధాలు తయారుచేసుకోవాలనే లక్ష్యం దిశగా వెళ్లడం, విదేశీ దిగుమతులపై ఆధరాపడటం తగ్గించడంతోనే ఇలా ఆయుధాల దిగుమతి తగ్గిపోయినట్లు పేర్కొంది.  

ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా

ప్రస్తుతం భారత్‌.. రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్' (స్వావలంబన) విధానం అమలుకు కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. 2023-24లో ఇండియాలో మొత్తం రక్షణరంగ ఉత్పత్తి రూ.1.27 ట్రిలియన్‌కి చేరింది. అయితే రష్యా నుంచే ఎక్కువగా (36 శాతం) భారత్‌ ఆయుధాలు దిగుమతి చేసుకున్నట్లు సిప్రీ తెలిపింది. అయితే 2015-19 (55 శాతం), 2010-14(72 శాతం)తో పోలిస్తే ఇది చాలా తక్కువ. 
మరోవైపు 2020-24 వరకు అంతర్జాతీయంగా భారీ ఆయుధాలు ఎగుమతి చేయడంలో అమెరికా 43 శాతంతో మొదటి స్థానంలో ఉంది. 9.6 శాతంతో ఫ్రాన్స్ రెండో స్థానంలో ఉంది. ఇక రష్యా (7.8 శాతం) మూడోస్థానం, చైనా (5.9 శాతం) నాలుగు, జర్మనీ (5.6 శాతం) అయిదో స్థానంలో నిలిచాయి.  
 
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment