Boat Accident: సముద్రంలో ఘోర ప్రమాదం.. 186 మంది గల్లంతు

యెమెన్, జిబౌటి తీర ప్రాంతాల మధ్య విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న నాలుగు పడవలు నడిసముద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 186 మంది గల్లంతయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Two dead, 186 missing as migrant boats capsize off Yemen and Djibouti coasts

Two dead, 186 missing as migrant boats capsize off Yemen and Djibouti coasts

యెమెన్, జిబౌటి తీర ప్రాంతాల మధ్య  విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న నాలుగు పడవలు నడిసముద్రంలో మునిగిపోయాయి. ఈ విషాద ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 186 మంది గల్లంతయ్యారు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) మీడియాకు తెలిపింది. వీళ్లందరూ పొట్టకూటి కోసం తమ సొంత దేశం విడిచి గల్ఫ్ దేశాల వైపు వెళ్తున్న వలసదారులే. ప్రస్తుతం గల్లంతైన 186 మంది కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. 

Also Read: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే

ఇథియోపియా ప్రజలు తమ దేశంలో ఘర్షణకు దూరంగా ఉండాలని గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తుంటారు. ఇందుకోసం వాళ్లు ఈ సముద్రమార్గాన్ని ఎంచుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన వలస మార్గం. అయితే ఇక్కడ ఇలాంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. రెండు నెలల క్రితమే ఓ ప్రమాదం జరిగింది. 

Also Read: ఇదెక్కడి అరాచకం.. బట్టలు విప్పి విమానంలో రచ్చ రచ్చ చేసిన మహిళ.. వీడియో చూశారా?

జనవరిలో యెమెన్‌ తీరంలో వలసదారులతో వెళ్తున్న ఓ పడవ మునిగిపోయింది. ఇందులో 20 మంది ఇథియోపియా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. గత ఏడాదిలో కూడా యెమెన్‌లో విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడటంతో 49 మంది మృతి చెందారు. 140 మంది గల్లంతయ్యారు. గల్ఫ్ ఆఫ్‌ అడెన్ గుండా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. . ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ దీనికి సంబంధించి ఓ కీలక విషయం చెప్పింది. 2024లో ఈ సముద్ర మార్గంలో 558 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. 

Also Read: ''మ్యాథ్స్‌ ఇస్లాం ద్వారా వచ్చింది''.. మరో వివాదంలో షామా మొహమ్మద్

Also Read: సచివాలయంలో కాంట్రాక్టర్ల మెరుపు ధర్నా.. ఊహించని పరిణామంతో భట్టి జంప్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నౌకాశ్రయంలో భారీ పేలుడు.. 400 మందికి పైగా?

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

New Update
Iran Harbor

Iran Harbor

ఇరాన్ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించిన ఘటన చోటుచేసుకుంది. బందర్‌ అబ్బాస్‌ సమీపంలో రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించగా.. 400 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ భారీ పేలుడు ఎలా సంభవించిందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

చమురు, పెట్రోకెమికల్స్ కారణంగా..

నౌకాశ్రయంలోని కంటెయినర్ల నుంచి పేలుడు సంభవించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే ఈ కంటైయినర్లలో చమురు, పెట్రోకెమికల్స్ ఉన్నాయి. వీటి కారణంగా పేలుడు సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి: BIG BREAKING: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

Advertisment
Advertisment
Advertisment