/rtv/media/media_files/2025/03/03/JIMpJ6iLegmuHTXyatE8.jpg)
Zelensky Photograph: (Zelensky)
తమ దేశం నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి కృతజ్ఙత లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు.ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా అమెరికా నుంచి సొమ్మును జెలెన్ స్కీ తీసుకున్నట్లు చెప్పారు. అతను పసిబిడ్డ నుంచి చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా బైడెన్ సర్కారు నుంచి సొమ్ములు తీసుకున్నారు.
Also Read: Russia: పైప్ లైన్ లో 15 కిలో మీటర్లు..ఉక్రెయిన్ సేనలకు చుక్కలు చూపించిన రష్యా!
ఇక రష్యా విషయంలో అత్యంత కఠినంగా ఉన్న అధ్యక్షుడిని నేను. దాని పైప్ లైన్ ఆపి ఆంక్షలు విధించాను.జావెలిన్ క్షిపణులు అందజేశాను.కానీ పుతిన్ తో కూడా మంచి సంబధాలున్నాయి.రష్యా విషయంలో నన్ను మించి కఠినంగా ఎవరూ లేరు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read: Champions Trophy 2025: ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
మరో వైపు ఉక్రెయిన్ వీలైనంత తొందరగా యుద్ధం ముగించాలన్ని ఒత్తిళ్లు డోజ్ సారథి మస్క్ వైపు నుంచి కూడా పెరిగాయి. తాజాగా తాను స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తే కీవ్ సేనలు కుప్పకూలుతాయని ఆయన హెచ్చరించారు.అదే సమయంలో ఉక్రెయిన్ ఓటమి అనివార్యమని వ్యాఖ్యానించారు.వాస్తవికతతో ఆలోచించేవారు. అర్థం చేసుకునే వారు ఎవరైనా ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ట్రంప్ తాజా కామెంట్లురావడం గమనార్హం.
ఇటీవల ఖనిజాల ఒప్పందం కోస అమెరికాలోని శ్వేత సౌధానికివచ్చిన జెలెన్ స్కీ అక్కడ వాగ్వాదం జరగడంతో సంతకాలు చేయకుండానే వెళ్లిపోయారు.ఆ తరువాత అమెరికా నుంచి కీవ్ కు సైనిక,ఇంటెలిజెన్స్ సాయాలు నిలిచిపోయాయి. మరో వైపు ఇదే అదనుగా రష్యాదాడులను తీవ్రతరం చేసింది. ఇక ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్నసమయంలో రష్యా గ్యాస్ పైప్ లైన్ పై ఆంక్షలు విధించారు.వాస్తవానికి దీని నుంచి ఐరోపాలోని జర్మనీకి గ్యాస్ సరఫరా అవుతుంది.
Also Read: ICC Champions Trophy 2025: అంబరాన్నంటిన టీమిండియా జట్టు సంబరాలు.. ఫొటోలు
Also Read: America Flight Accident: అమెరికాలో మరో విమాన ప్రమాదం...