Trump: మాకు సహకరించకుంటే శిక్ష తప్పదు.. నాటో దేశాలకు ట్రంప్ వార్నింగ్

గతంలో పశ్చిమాసియాలో అమెరికా చేసిన యుద్ధాలకు నాటో దేశాలు సహకరిస్తుండేవి. కానీ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.

New Update
Trump

Trump

గతంలో పశ్చిమాసియాలో అమెరికా చేసిన యుద్ధాలకు నాటో దేశాలు సహకరిస్తుండేవి. కానీ ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా దాడులను పలు సభ్య దేశాలు బహిరంగంగా ఖండిస్తున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే తమకు సపోర్ట్ ఇవ్వని నాటో దేశాలపై చర్యలు తీసుకునేందుకు ట్రంప్ సర్కార్‌ రెడీ అవుతోంది. ఇందులో భాగంగానే తమకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న దేశాలతో రెండు జాబితాలు సిద్ధం చేసింది.   

అనుకూల దేశాలు

యూరప్‌లో అమెరాకాకు విశ్వాసంగా ఉన్న దేశాల్లో పోలండ్ ఉంది. ఇక్కడ దాదాపు 10 వేల మంది అమెరికా సైనికులు ఆశ్రయం పొందుతున్నారు. వీళ్లకయ్యే ఖర్చులో ఎక్కువ భాగం పోలండ్ ప్రభుత్వమే భరిస్తోంది. పశ్చిమాసియాలో అమెరికా నిర్వహిస్తున్న సైనిక ఆపరేషన్లకు కూడా లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తోంది. రుమేనియా సైతం అమెరికాకు అండగా ఉంటోంది. తమ వైమానిక స్థావరాల్లో అమెరికా విమానాలు దిగేందుకు పర్మిషన్ కూడా ఇచ్చింది. బాల్టిక్ దేశాలైన లిథువేనియా, ఎస్తోనియా, లాత్వియా దేశాలు సైతం అమెరికాకు మద్దతు తెలిపాయి. 

Also Read: RBI సంచలన నిర్ణయం.. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లైసెన్స్‌ రద్దు 

వ్యతిరేక దేశాలు

నాటోలో పలు దేశాలు ఇరాన్‌పై యుద్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. స్పెయిన్ బహిరంగంగానే అమెరికా వైఖరిని తప్పుబట్టింది. తమ దేశంలోని సైనిక స్థావరాలు వినియోగించుకునేందుకు పర్మిషన్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. ఈ యుద్ధం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్‌ కూడా ప్రకటన చేశారు. తమకు మిత్రదేశమైనా చట్టాలకు వ్యతిరేకంగా చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.  

Also Read: ఆ దేశంలో విచ్చలవిడిగా సె*క్స్.. ప్రతి నలుగురిలో ఒకరికి HIV..

మరోవైపు బ్రిటన్ కూడా అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల ప్రారంభంలో తమ సైనిక స్థావరాలను అమెరికా, ఇజ్రాయెల్ వాడుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత రక్షణాత్మక చర్యల కోసం వీటిని వాడుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధి తెరిచేందుకు తమకు సహకరించాలని ట్రంప్‌ ఇచ్చిన పిలుపునకు కూడా బ్రిటన్ సపోర్ట్ చేయలేదు. దీంతో బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌కు ధైర్యం లేదని ట్రంప్ తీవ్రంగా విమర్శించారు.

అందుకే ట్రంప్ తమకు సపోర్ట్ ఇవ్వని నాటో దేశాలపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. మద్దతు తెలపని దేశాల నుంచి సైనికులను ఉపసంహరించి పోలండ్, రుమేనియా దేశాలకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అలాగే తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాలకు అత్యాధునిక అమెరికా ఆయుధాలు, రక్షణ సాంకేతికతను అమ్మకుండా నిలిపివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పెంటగాన్‌ నుంచి లీకైన సమాచారం ప్రకారం.. స్పెయిన్‌ లాంటి దేశాలను నాటో నుంచి సస్పెండ్‌ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు