Trump: పుతిన్ కంటే వాళ్లే యమ డేంజర్.. జాగ్రత్తగా ఉండాలంటూ ట్రంప్ సంచలన పోస్ట్‌!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అక్రమ వలసదారులే మరింత డేంజరస్ అంటూ చెప్పుకొచ్చారు.

New Update
Trump

Trump

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు  చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే కూడా అక్రమ వలదారుల వల్లే దేశానికి ఎక్కువ ముప్పు కల్గుతుందని చెప్పారు. వారిని తిరిగి వారి దేశాలకు పంపించేయాలంటూనే.. ప్రజలంతా వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతే కాకుండా తమ దేశానికి ఐరోపా లాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

Also Read: TG Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

ఆందోళన చెందాల్సిన...

ప్రస్తుతం ట్రంప్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.దీంతో ఈ విషయం పై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.ఉక్రెయిన్ విషయంలో రష్యాతో తనకున్న సాన్నిహిత్యంపై వస్తున్న విమర్శలపై ట్రంప్ స్పందించారు. ఈక్రమంలోనే మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు  పుతిన్ గురించి అమెరికా ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే మన దేశంలోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడే ముఠాలు, డ్రగ్ లార్డ్స్, హంతకులు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న వారిపై ఎక్కువగా దృష్టి సారించాలని చెప్పారు. ఇలా చేస్తేనే అమెరికా పరిస్థితి ఐరోపాలా మారదని ట్రూత్ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులో వెల్లడించారు.

Also Read: Wildfires: అమెరికాలో మళ్లీ కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు

ఇది ఇలా ఉండగా.. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపేస్తున్న సంగతి తెలిసిందే. అనేక దేశాలకు చెందిన పౌరులను.. ప్రత్యేక సైనిక విమానాల ద్వారా వారి దేశాలకు తరలిస్తున్నారు. చేతులకు సంకెళ్లు వేసి మరీ పంపిస్తుండగా పలు దేశాలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. అయినా ఏమాత్రం పట్టించుకోని ట్రంప్.. అదే పద్ధతి అనుకరిస్తున్నారు. ఇప్పటికే అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల్ని కూడా యూఎస్ సైనిక విమానాల ద్వారా తిరిగి ఇక్కడకు పంపించేసింది. ఇప్పటికీ ఈ అక్రమ వలసదారుల బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.

దీనిపై స్పందిస్తూ ట్రంప్.. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు పెద్ద ఎత్తునే తగ్గినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో కేవలం 8 వేల 326 మంది మాత్రమే పట్టుబడ్డారని చెప్పుకొచ్చారు. అదే గత ప్రభుత్వంలో మాత్రం ప్రతినెలా దేశంలోకి 3 లక్షలకు పైగా మంది అక్రమంగా ప్రవేశించే వారని ఆరోపించారు. అలాగే ఇప్పుడు 95 శాతం వలసలు తగ్గాయని.. తన పాలనలో ఎవరైనా చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశిస్తే కఠిన చర్యలతో పాటు పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Also Read: Zelenskyy: ట్రంప్ పిలిస్తే మళ్లీ వెళ్లి మాట్లాడుతా.. జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు

Also Read: Norway: అమెరికాకు నార్వే బిగ్ షాక్.. ఆ సేవలు నిలిపివేత

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

China: స్నేహం కావాలి..అమెరికా దెబ్బకు చైనాకు భారత్ గుర్తొచ్చింది..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో చైనాకు ఊపిరి ఆడడం లేదు. చైనా కూడా ఈ యుద్ధంలో తగ్గడం లేదు కానీ.. మిగతా దేశాల సపోర్ట్ కావాలని మాత్రం అనుకుంటోంది. భారత్‌ సహా పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అన్నారు. 

New Update
11

చైనాకు భారత్ పొరుగు దేశం. ఒకే సరిహద్దును పంచుకుంటున్న ఆసియా దేశాలు. కానీ ఆ దేశం ఎప్పుడు ఇండియా మీద కాలుదువ్వుతూనే ఉంటుంది. మన దేశంలో ప్రదేశాలను ఆక్రమించుకోడానిక, దాడి చేయడానికి అదను చూస్తూనే ఉటుది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. కానీ ఇప్పుడు మాత్రం భారత్ తో సమా పొరుగు దేశాతో వ్యాహాత్మక సంబంధలను పెంపొందించుకొంటామని అంటున్నారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్. దీనికి కారణం అమెరికా కొట్టిన సుంకాల దెబ్బ. మిగతా ఏ దేశాలకు లేని విధంగా అత్యధిక టారీఫ్ లను చైనాపై విధించారు ట్రంప్. ఏకంగా 125 శాతం టారీఫ్ లతో విరుచుకుపడ్డారు. చైనా కూడా అమెరికా ధీటుగా జవాబిస్తోంది కానీ ఎక్కువ కాలం నిలబడలేకపోవచ్చును. ఇప్పుడు ఆ దేశానికి మిగతా దేశాల సపోర్ట్ చాలా అవసరం. అందులో భాగ్గానే జిన్ పింగ్ స్నేహం కావాలి అంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. 

ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పని చేస్తాం..

తమ మధ్య అభిప్రాయ భేదాలు తగ్గించుకుని సరఫరా వ్యవస్థలను మరింత పెంపొందించుకునేదుకు ప్రయత్నిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెబుతున్నారు. పొరుగు దేశాలు ముఖ్యంగా భారత్ తో కలిసి పని చేస్తామని.. ఒక మంచి ఉమ్మడి సమాజాన్ని నిర్మిస్తామని అంటున్నారు. బీజింగ్‌లో మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో జిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కియాంగ్ కూడా దీనికి వత్తాసు పలికారు. అధ్యక్షుడు చెప్పినట్టుగా పొరుగు దేశాలతో వ్యవహారం అమలులో పెట్టాలని అన్నారు.  ఇందులో భాగంగా జిన్‌పింగ్‌ త్వరలో కీలక పొరుగు దేశాలైన వియత్నాం, మలేసియా, కాంబోడియాలలో సందర్శించే అవకాశముంది.

today-latest-news-in-telugu | china | india | usa | trump tariffs 

Also Read: Mary Kom: విడాకులు తీసుకోబోతున్న మేరీకోమ్?

 

Advertisment
Advertisment
Advertisment