/rtv/media/media_files/2025/01/07/jk8ttk9yQFBRmwmOPcAB.jpg)
Donald Trump, Justin Trudeau
ఏడాది చివర్లో కెనడాలో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిచినా తనకు పట్టింపు లేదని..లిబరల్స్ గెలిచినా తాను పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మీ వైఖరి కారణంగానే కెనడాలో లిబరల్ పార్టీ గెలిచే సూచనలు కన్పిస్తున్నాయని..ఆ పార్టీ గెలిచిన అనంతరం అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న ఓ విలేఖరి మాటలకు ఆయన స్పందించారు.
Also Read: America: అమెరికా శాస్త్రవేత్తలు, పరిశోధకులను వెంటాడుతున్న తొలగింపు భయం
సంప్రదాయవాదుల కంటే ఉదారవాదులను డీల్ చేయడమే తనకు ఇష్టమని పేర్కొన్నారు.ఏం జరిగినా పన్నుల విషయంలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఉద్దేశం లేదన్నారు. లిబరల్స్ ప్రధాన ప్రత్యర్థి,కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పోయిలివ్రేను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ విమర్శలు గుప్పించారు.
Also Read: Yadagiri Gutta: ఇక నుంచి ఆ పుణ్య క్షేత్రంలో మద్యం, మాంసం విక్రయాలు బంద్..!
Trump Says About Canada Elections
అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వాములైన కెనడా ,మెక్సికో లపై 25 శాతం సుంకాలు వసూలు మార్చి 4 నుంచి అమలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వలసలు,డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయడంలో విఫలమైతే అమెరికాలో 51 వ రాష్ట్రంగా కెనడా చేరాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు ట్రూడోకు ట్రంప్ చురకలు అంటించారు.దీంతో అగ్రరాజ్యం పై కెనడా ప్రతీకార చర్యలకు దిగింది.
అమెరికా ఉత్పత్తుల పై తామూ 25 శాతం సుంకం విధించనున్నట్లు ప్రకటించింది. తాజాగా కెనడా ఉక్కు,అల్యూమినియం పై టారిఫ్ లు 50 శాతానికి పెంచుతామని ప్రకటించి..అనంతరం ఈ పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
కెనడా 24 వ ప్రధానిగా మార్క్ కార్నీ ఇటీవల ప్రమాణం చేశారు.త్వరలో జరిగే ఎన్నికల్లో లిబరల్ పార్టీని కార్నీ విజయవంతంగా నడుపుతారని ఆ పార్టీ కార్యకర్తలు ఆశిస్తున్నారు.జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా 59 ఏళ్ల కార్నీని ఎన్నుకున్న సంగతి తెలిసిందే.ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికల్లో లిబరల్స్ మళ్లీ గెలుపొంది...ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారని పలు సర్వేలు పేర్కొంటున్నాయి.
Also Read: Musk-Tesla: టెస్లా కార్లు తగలబెట్టడం ఉగ్రవాద చర్యే: మస్క్!