Trump: చర్చలు విఫలమైతే వ్యూహం మారుస్తాం.. ట్రంప్ సంచలన వార్నింగ్

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై స్పందించారు. ఒకవేళ చర్చలు అనుకున్నట్లుగా జరగకపోతే తమ వ్యూహాన్ని మార్చుకుంటామని తెలిపారు.

New Update
Trump Responds as US-Iran Indirect Talks Begin Amid High Security

Trump Responds as US-Iran Indirect Talks Begin Amid High Security

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులు విడుదల చేయడం, లెబనాన్‌లో కాల్పుల విరమణ, హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరవడం లాంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంకా వీటిపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. పాక్ అధికారులు మధ్యమర్తిత్వంతో పరోక్ష పద్ధతిలో ఈ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఇండియాకు గుడ్‌ న్యూస్‌..హార్మూజ్‌ను దాటిన భారత ఎల్‌పీజీ నౌక

ఈ చర్చలు జరుగుతున్న క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్‌తో చర్చలు ప్రారంభమయ్యాయని.. త్వరలోనే హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. అలాగే ఇరాన్‌ను ఓ "వైఫల్యం చెందిన దేశం"గా అభివర్ణించారు. ఒకవేళ చర్చలు అనుకున్నట్లుగా జరగకపోతే తమ వ్యూహాన్ని మార్చుకుంటామని తెలిపారు. చర్చల ఫలితం ఏదైనాగానీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 

Also Read: ఇరాన్‌కు సైనికుడిగా.. అమెరికాకు నాయకుడిగా.. మునీర్ 'డ్రెస్ కోడ్' వెనుక రహస్యం అదేనా..

ఇదిలాఉండగా చర్చలు ప్రారంభం కావడానికి ముందు పాక్‌ ప్రధాని షెహబాజ్.. ఇరాన్‌ బృందంతో భేటీ అయ్యారు. అలాగే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నేతృత్వంలోని టీమ్‌తో కూడా సమావేశమయ్యారు. మరి ఈ చర్చల్లో అమెరికా-ఇరాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పాక్‌ ప్రధాని కూడా ఈ చర్చలకు ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవి సజావుగా జరిగితే సవ్యంగా ఉంటుందని లేదంటే సర్వనాశనం అవుతుందని పేర్కొన్నారు.  
 

Advertisment
తాజా కథనాలు