USA: అమెరికాలో కెనడా విలీనం..అందుకే ట్రుడో రాజీనామా అంటున్న ట్రంప్

అమెరికాలో 51వ రాష్ట్రంగా కెనడా చేరాలని ప్రతిపాదనను తాను పునరుద్ఘాటిస్తున్నాని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇలా అవడం కెనడాలో చాలా మందికి ఇష్టమేనని..అందుకే ఆ దేశ ప్రధాని ట్రుడో రాజీనామా చేశారంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 

New Update
trump

Donald Trump, Justin Trudeau

కెనడా దేశం ఎక్కువగా అమెరికా మీద ఆధారపడుతుంది. అత్యధికంగా యూఎస్‌ నుంచి రాయితీలు పొందుతుంది. అదే కెనడా అమెరికాలో కలిసి పోతే అటు అమెరికాకు, ఇటు కెనడాకు రెండింటకీ చాలా మంచిది. యూఎస్ ఎక్కువ నష్టపోనక్కర్లేదు. సుంకాలు ఉండవు, పన్నులు తగ్గుతాయి...ఇదీ ట్రంప్ ఎప్పటి నుంచో చెబుతున్న మాటలు. ఆను పదవిలోకి వచ్చాక కెనడా, మెక్సికోలపై 25 శాతం సుంకాలు విధిస్తానని కూడా ప్రకటించారు. వలసలు, డ్రగ్స్‌ అక్రమరవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేనిపక్షంలో సుంకాలు పెంచుతానని కూడా హెచ్చరించారు. ఇందులో విఫలం అయితే కెనడాను అమెరికాలో కలిపేసుకుంటామని కూడా డైరెక్ట్‌గా ట్రుడోకే చెప్పారు ట్రంప్.

Also Read:  Chhattisgarh: జర్నలిస్ట్ ముకేశ్ హత్య కేసులో వెలుగులోకి భయానక విషయాలు..

 

ఆ విషయం ట్రుడోకు తెలుసు... 

ఇప్పుడు కెనడా ప్రధాని రాజీనామా సందర్భంగా ట్రంప్ మరోసారి ఆ విషయాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. కెనడాను అమెరికా 51వ రాష్ట్రగా చేరాలని తిరిగి తాను ప్రతిపాదిస్తున్నాని అన్నారు. అమెరికాలో ఉండడం చాలామంది కెనడియన్లకు కూడా ఇష్టమేనని...అది తెలిసే ట్రుడో రాజీనామా చేశారని ట్రప్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కెనడా తమ దేశంలో కలిసి పోతే రాయితీల పేరున అమెరికా ఎక్కువ నష్టపోనక్కర్లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు రష్యా, చైనాల తాలూకా షిప్‌ల నుంచి ఎలాంటి ఆపద కూడా ఉండదు అంటూ తన పోస్ట్‌లో రాశారు.  

మరోవైపు సొంత పార్టీలోనే తన మీద వ్యతిరేకత ఉన్నప్పుడు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం సరైనది అవదని ట్రూడో అన్నారు.  తాను ఎప్పుడూ కెనడాలోని ప్రజల కోసమే పోరాడనని చెప్పారు. 2015లో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అంతర్గత పోరు కారణంగా నిన్న తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తన సొంత పార్టీ లిబరల్ నాయకత్వాన్ని కూడా వదులుకున్నారు. 

Also Read: Allu Arjun: ఈరోజు శ్రీ తేజ్‌ను పరామర్శించనున్న అల్లు అర్జున్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment