/rtv/media/media_files/2026/04/23/trump-2026-04-23-20-30-36.jpg)
Trump orders US Navy to shoot, kill small boats laying mines in Strait of Hormuz
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హర్మూజ్ జలసంధిలో మందుపాతరలు పెడుతూ ఆందోళన రేపుతున్న ఇరాన్ నౌకలను కాల్చేయాలని అమెరికా నౌకదళాన్ని ఆదేశించారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. '' హర్మూజ్ జలసంధిలో మైన్లు పెడుతున్న ఏ చిన్న పడవనైనా కాల్చి ధ్వంసం చేయండని నావికాదళాన్ని ఆదేశించాను. ఈ విషయంలో ఏమాత్రం సంకోచం వద్దని చెప్పాను.
Also Read: యుద్ధం ఉన్నప్పటికీ.. విద్యాలయాలను విస్మరించని ఇరాన్.. 775 స్కూళ్లకు మరమ్మతులు
ప్రస్తుతం అమెరికా మైన్ స్వీపర్లు హర్మూజ్ జలసంధిని క్లియర్ చేస్తున్నాయి. ఈ కార్యాచరణను మూడు రేట్ల వేగంతో చేయాలని ఆదేశిస్తున్నానని'' ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాదు ఇరాన్ ప్రస్తుతం తమ నాయకుడు ఎవరో తేల్చుకోలేక ఇబ్బందులు పడుతోందని సెటైర్లు వేశారు. హర్మూజ్‌పై తాము పూర్తిగా నియంత్రణ సాధించామని పేర్కొన్నారు. అమెరికా నేవీ పర్మిషన్ లేకుండా ఏదైనా నౌక ప్రవేశించడం గానీ.. బయటకు వెళ్లడం లాంటిది ఉండదని తెలిపారు. తమతో ఇరాన్ ఒప్పందానికి వచ్చేవరకు ఇది మూసి ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: నావికాదళ కార్యదర్శిపై వేటు.. ఇరాన్ యుద్ధం వేళ ట్రంప్ సంచలన నిర్ణయం
మరోవైపు హిందూ మహాసముద్రంలో కూడా 'మేజిస్టిక్ ఎక్స్' అనే ఇరాన్‌కు చెందిన నౌక చమురును అక్రమంగా తరలిస్తోందనే ఆరోపణలతో అమెరికా సైన్యం దాన్ని స్వాధీనం చేసుకుంది. శ్రీలంక, ఇండోనేసియా మధ్య ప్రయాణిస్తున్న ఈ నౌకపై అమెరికా దళాలు హెలికాప్టర్ల ద్వారా దిగాయి. ఆ తర్వాత దీన్ని సీజ్ చేసుకున్నాయి. నౌకను స్వాధీనం చేసుకున్న దృశ్యాలను అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ఎక్స్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Follow Us