/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
హోచ్ 1బీ, ఎల్ 1 వీసాదారులకు మరో షాక్ షాక్ తగలనుందా...అంటే అవుననే అంటున్నారు. హెచ్-1బీ, ఎల్-1 వీసాలను ఆటోరెన్యూవల్ చేసుకోవడానికి ఉన్న అవకాశాన్ని రద్దు చేయాలని ఇద్దరు రిపబ్లికన్ సెనెటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. వర్క్ వీసాలకు ఆటోరెన్యూవల్ అనేది ఇమ్మిగ్రేషన్ అమలుకు అత్యంత ప్రమాదకరమైందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీన్ని ట్రంప్ ఆమోదిస్తారా లేదనేది తెలియాల్సి ఉంది. అసలు ధీనిపై ఆయన ఏం అభియాప్రయం వ్యక్తం చేశారన్నది కూడా ఇంకా బయటకు వెల్లడి కాలేదు.
హెచ్ 1 బ, ఎల్ 1 వీసాల విషయంలో బైడెన్ ప్రభుత్వంలో చాలా హెల్ప్ చేసింది. దీని గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు 180 రోజులు ఉన్న గడువును 540 రోజులకు పెంచింది. అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలస పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. సైనిక విమానాల్లో అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారందరినీ వారి దేశాలకు వెనక్కు పంపేస్తోంది. ఈ క్రమంలో హెచ్ 1బీ, ఎల్ 1 వీసాల గడువు అన్ని రోజులు ఉంటే అక్రమ వలసలను అడ్డంకిగా మారవచ్చునని సెనేటర్లు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఇద్దరు తీర్మానం కూడా ప్రవేశపెట్టారు.
గత ప్రభుత్వ వీసా రూల్ 13 జనవరి 2025న డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఫైనల్ చేసింది. దీని వలన వలసదారులు, శరణార్థులు, గ్రీన్‌కార్డ్‌దారులు, హెచ్-1బీ, ఎల్-1 వీసా దారుల స్పౌజ్ లకు ఛాలా హెల్ప్ అయింది. భారీ సంఖ్యలో వర్క్ వీసాలపై పనిచేస్తున్న భారతీయులు కూడా లబ్ధిపొందారు. అయితే ఈ నిర్ణయం వలన అక్రమ వలసదారులు ఏళ్ల తరబడి అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఇది సహకరిస్తుందని వ్యాఖ్యానించారు సెనేట్ స్కాట్. ట్రంప్ కొత్త రూల్స్..ఈ నిబంధనలు రద్దు చేయకుండా అప్లై చేయడం కుదరదని అన్నారు. అక్రమ వసదారులను గుర్తించడం కష్టమని చెప్పారు.
ఇది కూడా చదవండి: PMGKAY: ట్యాక్స్ పేయర్లకు బిగ్ షాక్.. ప్రభుత్వ పథకాలు బంద్!