Trump-Musk-Rubio: ట్రంప్‌ క్యాబినెట్‌ మీటింగ్‌ లో గొడవ పడ్డ మస్క్‌..రూబియె

ట్రంప్‌ సమక్షంలో నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో..ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో , మస్క్‌ లు గొడవ పడినట్లు సమాచారం.ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా భారీగా ఉద్యోగులను తొలగిస్తుంది.ఆ విషయం గురించి చర్చిస్తున్న సమయంలో వారు గొడవపడ్డారు.

New Update

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సమక్షంలో నిర్వహించిన క్యాబినెట్‌ సమావేశంలో..ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ,ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ లు గొడవ పడినట్లు  తెలుస్తోంది. ఈ మేరకు పలు వార్తా సంస్థలు పలు కథనాలు వెల్లడించాయి.అమెరికాలో డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ శాఖను ట్రంప్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Syria:సిరియాలో పోలీసుల మృతితో ప్రభుత్వం రివేంజ్.. అసద్ గ్యాంగ్ లో 200 మంది మృతి!

ఈ శాఖ వృథా ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా భారీగా ఉద్యోగులను తొలగిస్తుంది.దీని పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విమర్శల పై చర్చించేందుకు ట్రంప్ అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం జరిగింది. అందులో డోజ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్న మస్క్‌,విదేశాంగ మంత్రి రూబియోలు సైతం పాల్గొన్నారు.

Also Read:  farmhouse meeting: KCR ఫామ్ హౌస్‌కు వెళ్లిన ఎమ్మెల్యే హాస్పిటల్‌పాలు

ఈ సమయంలో మస్క్‌ మాట్లాడుతూ..రూబియో ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదని, తాను మాత్రం పని చేయని వారిని తొలగిస్తున్నానన్నారు. దీని పై రూబియో మాట్లాడుతూ..ఇప్పటికే1500 మంది ఉద్యోగులు ముందే పదవీ విరమణ చేశారు. నేను తొలగించాలంటే వారిని మళ్లీ విధుల్లోకి తీసుకొని తొలగించాల్సి వస్తుందని వ్యంగ్యంగా సమాధానమిచ్చినట్లు సమాచారం.

ఇక ఈ కథనాల పై ఓవల్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్‌ స్పందించారు. ఘర్షణ లాంటిది ఏం లేదు. నేను అక్కడే ఉన్నా.మస్క్‌ రూబియోతో కలిసిపోయాడు. వారిద్దరూ ఎంతో అద్భుతంగా పని చేస్తున్నారని ట్రంప్‌ బదులిచ్చారు.ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ వ్యయాలను కట్టడి చేయడం కోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీని ఏర్పాటు చేశారు.

దీని పగ్గాలను మస్క్‌ కు అప్పగించారు. ఇందులోభాగంగా వేల మంది ఫెడరల్‌, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించేందుకు మస్క్‌ సిఫార్సు చేస్తున్నారు. తాను సిబ్బందిని తగ్గించడంతోపాటు...బాగా పని చేసే వారిని ఉన్నత స్థానాలకు తీసుకొస్తానని చెప్పారు.

పలువురు నిపుణులు,డెమోక్రాట్లు మస్క్‌ చర్యలు సరైనవికావని విమర్శలు గుప్పిస్తుండగా ట్రంప్‌ వాటిని ఖండిస్తూ వస్తున్నారు.

Also Read: Womens Day : ఈరోజు స్పెషల్ ఇదే.. మహిళల చేతికి మోదీ సోషల్ మీడియా అకౌంట్లు

Also Read: Air India: వీల్‌ఛైర్ లేదన్న ఎయిరిండియా.. ఐసీయూలో వృద్ధురాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 104శాతం సుంకాలపై చైనా మండిపడుతోంది.  దీనిపై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తీవ్రంగా స్పందించారు. అమెరికాకు తగిన విధంగా బదులిచ్చేందుకు తమ వద్ద అన్ని ఆయుధాలున్నాయని తెలిపారు. 

New Update
xi jinping and Trump

xi jinping and Trump

చైనాపై ట్రంప్ టారీఫ్ లతో ఆ రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచారు.  తమ హెచ్చరికలను చైనా పట్టించుకోలేదని ట్రంప్ ఆ దేశంపై ఏకంగా 104శాతం సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఖంగుతిన్నాయి. చైనా అయితే ఆగ్రహంతో పొగలు కక్కుతోంది.  సుంకాల పేరుతో అమెరికా బ్లాక్ మెయిల్  చేస్తోందని మండిపడింది. దీనిపై చివర వరకు తాము పోరాడతామని..ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా మా ఆర్థిక విధానాలను రూపొందించామని చెబుతోంది. అలాగే అమెరికాకు తగిన విధంగా బదులు ఇస్తామని..అందుకు తగ్గ ఆయుధాలన్ని మా దగ్గర ఉన్నాయని చైనా ప్రీమియర్‌ లీ కియాంగ్‌ తీవ్రంగా స్పందించారు. అమెరికా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆర్థిక పరంగా బలవంతపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు. 

ముందే హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు..

రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల్లో భాగంగా చైనాపై 54 శాతం సుంకాలను విధించారు. దీనికి ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై ట్రంప్ మండిపడ్డారు చైనా తప్పు చేస్తోందని హెచ్చరించారు. ఏప్రిల్ 8లోగా సుంకాలను తగ్గించకపోతే 50శాతం పెంచుతామని చెప్పారు. అన్నట్టుగానే ఇప్పుడు ఈరోజు చైనాపై ఏకంగా 104 శాతం మేర టారీఫ్ లను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

today-latest-news-in-telugu | china | donald trump tariffs 

Also Read: USA: కలలు కల్లలుగానే మిగిలిపోతాయా..ఆందోళనలో అమెరికా విద్యార్థులు

Advertisment
Advertisment
Advertisment