/rtv/media/media_files/2025/02/14/trump-modi.jpg)
Trump- Modi
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్ లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ విషయాలు వెల్లడించారు.ఈ రోజున ట్రంప్ లిబరేషన్ డే గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్,ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు.
Also Read: Trump-Musk:డోజ్ నుంచి మస్క్ ఔట్..!
అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమ పై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు.ఆ దేశాల పై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్ లుగా ట్రంప్ పేర్కొన్నారు.ఇక భారత్ పై తాము 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఇక భారత ప్రధాని మోడీ గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు.తనకు మోడీ గొప్ప స్నేహితుడని,అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని తెలిపారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు.ఇక చైనా పై 34 శాతం సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపారు.యూఎస్ కు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తుల పై కనీసం 10 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఈరోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది.అమెరికా ఇండస్ట్రీ ఈరోజు పునర్జన్మించినట్లు అయ్యింది.యూఎస్ మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు.తమ టాక్స్ పేయర్లను గత 50 ఏళ్లుగా దోచుకున్నారు.ఇక అది జరగదు.
మా పై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం.అమెరికాకు ఈరోజు నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం వచ్చింది. ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి.విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం.
అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తుల పై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. అనేక దేశాలు అమెరికా మేధో సంపత్తిని దొంగిలించాయి.
పలు దేశాలు అయితే అన్యాయమైన నియమాలను కూడా అవలంభించాయి.అమెరికా దిగుమతి చేసుకున్న మోటారు సైకిళ్ల పై 2.4 శాతం సుంకాలు విధించింది. ఇక థాయిలాండ్,ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్ర వాహనాల పై 60 శాతం ,భారత్ 70 శాతం ,వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తూ వచ్చాయి.
ఈ క్రమంలో ట్రంప్ విధించి ప్రతీకార సుంకాలు..ఇలా ఉన్నాయి...
భారత్ -26 శాతం, చైనా 34 శాతం, ఈయూ 20 శాతం, తైవాన్ 32 శాతం,జపాన్ 24 శాతం,దక్షిణ కొరియా 25 శాతం,థాయిలాండ్ 36 శాతం,స్విట్జర్లాండ్ 31 శాతం, ఇండోనేషియా 32 శాతం,మలేషియా 24 శాతం, కంబోడియా 49 శాతం,యూకే 10 శాతం, సౌత్‌ఫ్రికా 30 శాతం,బ్రెజిల్ 10 శాతం, బంగ్లాదేశ్ 37శాతం,సింగపూర్ 10 శాతం,ఇజ్రాయెల్ 17 శాతం,పిలిఫ్ఫీన్స్ 17 శాతం,చిలి 10 శాతం, ఆస్ట్రేలియా 10 శాతం, పాకిస్తాన్ 29 శాతం, టర్కీ 10శాతం.శ్రీలంక 44 శాతం, కొలంబియా 10 శాతం గా ఉన్నాయి.
Also Read:Again Earthquake in Myanmar : మయన్మార్ లో మరోమారు భూకంపం..ఈసారి నష్టం..
trump | bharat | trump tariffs | trump tariffs on india | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates