/rtv/media/media_files/2025/01/06/tbPMq54KFABOB8tsbTho.jpg)
justin trudeau Photograph: (justin trudeau)
కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఇటీవల ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెనడా తో సంబంధాలపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ దేశ నాయకత్వంలో మార్పు వచ్చిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని ఢిల్లీ ఆకాంక్షించింది.
భారత విదేశాంగ మంత్రి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడారు. కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆధ్వర్యంలోనే తీవ్ర వాదులకు ,ఉగ్రవాదులకు లైసెన్సులు వచ్చాయి. దీని కారణంగానే ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొత్త నాయకత్వంలో పరస్పర విశ్వాసం, సున్నితత్వంతో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించాలని ఆశిస్తున్నా అని జైశ్వాల్ పేర్కొన్నారు.
Also Read: Minister Ponnam Prabhakar: తెలంగాణలో టీవీ సీరియల్స్ బంద్...?..మంత్రి పొన్నం సంచలనం..!
ఇటీవల నూతన ప్రధానిగా ఎన్నికైన అనంతరం మార్క్ కార్నీ సైతం భారత్ తో సంబంధాల పై మాట్లాడారు.ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో భారత్ తో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్ధరిస్తామన్నారు.తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధంగా కృషి చేయడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు.
ఢిల్లీతోనే కాకుండా సారూప్యత కలిగిన దేశాలతోనూ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్నీ భారత్ కు అనుకూలంగా ఉండడంతో భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
canada | justin-trudeau | latest-news | bharat | telugu-news | latest-telugu-news | latest telugu news updates