/rtv/media/media_files/2026/03/24/top-maoist-leader-paparao-surrenders-to-police-in-bijapur-2026-03-24-21-51-45.jpg)
Top maoist leader paparao surrenders to police in bijapur
గత కొంతకాలంగా మావోయిస్టులు పోలీసులు, ప్రభుత్వాల ముందు లొంగిపోతూ వస్తున్నారు. తాజాగా మరో మావోయిస్టు అగ్రనేత జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. పాపారావు అలియస్ సున్నం చంద్రయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తమ అనుచరులు17 మందితో బీజాపూర్ ఎస్పీ ముందు లొంగిపోయాడు. లొంగిపోయిన వాళ్లలో 10 మంది పురుషులు ఉండగా.. 8 మంది మహిళలు ఉన్నారు.
Also Read: మహిళలకే కాదు, పురుషులకూ ఫ్రీ బస్సు.. అన్నాడీఎంకే సంచలన మేనిఫెస్టో!
వీళ్ల నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే బస్తర్ ప్రాంతానికి చెందిన పాపారావుపై రూ.2 కోట్ల రివార్డు ఉంది. అలాగే ఇతనిపై 50 కేసులు ఉన్నాయి. సుక్మా జిల్లా కలెక్టర్ అపహరణ విషయంలో పాపారావు కీలక పాత్ర పోషించాడు. 76 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయంలో కూడా పాపారావు హస్తం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: వైష్ణవి హత్యకేసులో సంచలన విషయాలు...కట్నం ఆశచూపి..
Follow Us