/rtv/media/media_files/2025/02/16/6uvteTUuHgGFZjBeBLT8.jpg)
musk trump Photograph: (trump)
ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ..అనేక శాఖల పునర్‌వ్యవస్థీకరణకు సిద్ధమవతున్నారు.ఇప్పటికే వేలాది మంది ఉద్యోగుల పై వేటు వేసిన ట్రంప్ ...ప్రభుత్వ ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగించే అంశానికి సంబంధించి ప్రణాళికలు ఇవ్వాలంటూ ఫెడరల్ ఏజెన్సీలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
మార్చి 13 లోగా ప్రణాళికలను...
ఇప్పటికే వేలాది మంది ప్రొబేషనరీ ఉద్యోగులను తొలగించిన ట్రంప్...కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ శాఖల్లో మానవ వనరులను తగ్గించే ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి మార్చి 13 లోగా ప్రణాళికలను అందించాలని ఆదేశించారు.
ఉద్యోగుల తొలగింపుతో పాటు ఉద్యోగ స్థానాన్ని కూడా పూర్తిగా తొలగించాలని అందులో పేర్కొన్నారు.వీటి ఫలితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పనితీరులో విస్తృత మార్పులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వ ఖర్చు ఖజానాకు భారంగా తయారైనట్లు శ్వేత సౌధ కార్యాలయ నిర్వహణ డైరెక్టర్ రసెల్ వాట్ వెల్లడించారు.
వీరి పనితీరు చాలా అసమర్థంగా ఉందని, అమెరికన్ ప్రజలకు ఆశించిన ఫలితాలను అందించడం లేదని వివరించారు. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి ట్రంప్ ఇదివరకే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో మానవ వనరులు తగ్గించేందుకు తక్షనమే సన్నాహాలు చేపట్టాలని అందులో పేర్కొన్నారు.అయితే ఇప్పటికే కొన్ని శాఖలు ఈ ప్రక్రియను మొదలు పెట్టినట్లు సమాచారం.