INTERNET : ఇండియాను భయపెడుతున్న మిడిల్ ఈస్ట్ వార్..హౌతీల ఎంట్రీతో..

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పటికే గ్యాస్‌, ఇంధన సరఫరాలో ఇబ్బందులు తలెత్తగా తాజాగా ఇంటర్నెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుందన్న భయం ఆయా దేశాలను వెంటాడుతోంది. ముఖ్యంగా ఇండియాకు మిడిల్‌ ఈస్ట్‌ వార్‌ తలనొప్పిగా మారింది

New Update
FotoJet (3)

Internet Cut To India.?

 INTERNET : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రపంచ దేశాలకు నిద్రలేకుండా చేస్తోంది. ఇప్పటికే గ్యాస్‌, ఇంధన సరఫరాలో ఇబ్బందులు తలెత్తగా తాజాగా ఇంటర్నెట్‌ పై ప్రభావం పడే అవకాశం ఉంటుందన్న భయం ఆయా దేశాలను వెంటాడుతోంది. ముఖ్యంగా ఇండియాకు మిడిల్‌ ఈస్ట్‌ వార్‌ తలనొప్పిగా మారింది. యుద్ధం మూలంగా ప్రపంచ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాపై దాడులు జరగొచ్చనే భయం పట్టుకుంది.ఎర్ర సముద్రం గుండా వెళ్లే కేబుల్స్‌పై దాడులు జరిగే ఛాన్స్ ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది. 2025 సెప్టెంబర్‌లో ఓ నౌక కారణంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ దెబ్బతిన్నాయి. దాంతో ఇంటర్నెట్‌కు తీవ్ర ఆటంకం వాటిల్లింది.

తాజాగా ఇరాన్‌కు మద్ధతుగా హౌతీలు రంగంలోకి దిగడంతో వారు ఈ కేబుల్స్‌ను టార్గెట్‌ చేసుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2025లో కేబుల్స్ దెబ్బతినడం వల్ల ఇండియాపైనా ప్రభావం పడింది. అలాంటిది ఇపుడు హౌతీలు టార్గెట్‌ చేసుకుంటే  మరోసారి అలాంటి ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు, క్లౌడ్ సదుపాయాలు,AI సాంకేతికతపై ఇండియా ఎక్కువగా ఆధారపడింది.అంతర్జాతీయ డేటాలో దాదాపు 95 శాతం  సముద్రగర్భ కేబుల్స్ ద్వారానే ప్రసారం అవుతున్న ప్రస్తుత తరుణంలో కేబుల్స్‌ దెబ్బతింటే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముంబై, చెన్నై కేంద్రంగా మెజార్టీ స్టేషన్లు పనిచేస్తున్నాయి. కాగా ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీకి యుద్ధం సవాల్‌గా మారింది.

#internet #red-sea #houthis #houthis attack israel #Houthi attacks Red Sea #houthis attack #houthis red sea attack
Advertisment
తాజా కథనాలు