/rtv/media/media_files/2025/03/28/nJFlB9Fed3KWXpSBkhiH.jpg)
Earthquake in Myanmar and Thailand
మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపాలు సంభవించడం సంచలనం రేపింది. భూకంపాల ధాటికి మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. మయన్మార్‌లో ఇప్పటిదాక 103 మంది మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు థాయ్‌లాండ్‌లో నలుగురు మృతి చెందగా.. 50 గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఎత్తైన భవనాలు కుప్పకూలడంతో దాని కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి.
Also Read: నేపాల్‌లో మరోసారి ఘర్షణలు..హిందూ దేశం, రాచరిక పాలన కావాలని డిమాండ్
మయన్మార్ రాజధాని నేపిడాలో వెయ్యి పడకల ఆస్పత్రి కుప్పకూలడం కలకలం రేపుతోంది. అలాగే మాండలే నగరంలోని ఐకానిక్ వంతెన, పలుచోట్ల ఆలయాలు కూడా భూకంపం ప్రభావానికి కూలిపోయాయి. బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం కూలడంతో 90 మంది గల్లంతైనట్లు థాయ్ రక్షణ మంత్రి తెలిపారు. ఇదిలాఉండగా శుక్రవారం రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి మయన్మార్, థాయ్‌లాండ్‌లో అనేక భవనాలు ఊగిపోయాయి. మరికొన్ని కుప్పకూలిపోయాయి. పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి.
🚨Earthquake Thailand and Myanmar Burma🚨
— DonaldBest.CA * DO NOT COMPLY (@DonaldBestCA) March 28, 2025
BREAKING - Bangkok - High Rise Apartment Collapses - Under construction - unknown casualties.
Initial reports from Myanmar Burma indicate 7.7 heavy damage.
13:22 hours local / 02:22 Eastern Toronto time.
Family and friends all safe… pic.twitter.com/eBthJwNw0T
🚨43+ Workers Dead or Trapped In Bangkok Earthquake High Rise Collapse. 7 escaped, 1 confirmed dead. (Thai TV News)
— DonaldBest.CA * DO NOT COMPLY (@DonaldBestCA) March 28, 2025
🚨Massive Damage in Northwest Thailand
🚨8.2 magnitude earthquake epicenter near Mae Hong Sorn, Thailand on Myanmar border.
🚨Highway Bridge collapse in Chiang… https://t.co/ljxwCUSbsp pic.twitter.com/41dgg1nWya
Also Read: మందు బాబుల గుండెలు పిండేసే వార్త.. ఏమిటో తెలిస్తే తట్టుకోలేరు!
అయితే థాయ్‌లాండ్‌లో బ్యాంకాక్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీ భూకంపం రావడంతో ఆ దేశంలో ఉన్న భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. ఏ భారతీయ పౌరుడికి ఆపద తలెత్తినట్లు తమ దృష్టికి రాలేదని చెప్పింది. ఈ మేరకు అక్కడ ఉండే ఇండియన్ల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఏదైనా అత్యవసర పరిస్తితి వస్తే.. +66 618819218 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.
Also Read: కాపాడండి ప్లీజ్ అంటూ కార్మికుల ఆర్తనాదాలు.. కన్నీరు పెట్టిస్తున్న వీడియోలు
🚨Earthquake Thailand and Myanmar Burma🚨
— DonaldBest.CA * DO NOT COMPLY (@DonaldBestCA) March 28, 2025
BREAKING - Bangkok - High Rise Apartment Collapses - Under construction - unknown casualties.
Initial reports from Myanmar Burma indicate 7.7 heavy damage.
13:22 hours local / 02:22 Eastern Toronto time.
Family and friends all safe… pic.twitter.com/eBthJwNw0T
Earthquake in Bangkok | Myanmar Earthquake Live Updates | telugu-news | rtv-news