/rtv/media/media_files/2025/03/05/EnCCVjpbRPk2rJQb6YEp.jpg)
Khyber Pakhtunkhwa Photograph: (Khyber Pakhtunkhwa)
రంజాన్ మాసం ప్రారంభ వేళ పాకిస్తాన్‌లో సూసైడ్ బాంబర్ ఉగ్రదాడి కలకలం రేపింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని కంటోన్మెంట్ పోస్టు లక్ష్యంగా చేసుకొని మంగళవారం సాయంత్రం బ్లాస్ట్‌లు చేశారు. ఈ దాడికి పాల్పడింది పాక్ తాలిబన్లతో సంబంధం ఉన్న జైష్ ఉల్ ఫుర్సాన్ ఉందని పాకిస్తాన్ ఆర్మీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఐదుగురు టెర్రరిస్టులు ప్లాన్ ప్రకారం ఈ అటాక్ చేసినట్లు తెలుస్తోంది. తాలిబాన్ మద్దతుదారుడైన ఓ మతాధికారి హత్యకు గురైన కొన్ని రోజుల తర్వాత ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 28న అదే ప్రావిన్స్‌లోని ఒక సెమినరీలో శుక్రవారం ప్రార్థనల సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఆ దాడిలో తాలిబాన్ అనుకూల మతాధికారి హమీదుల్ హక్ హక్కానీ, నలుగురు సందర్శకులు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు.
Also read : Telangana Inter Exams : తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు!
BREAKING: Top Pakistan Army and ISI officials are among ongoing attacks on Bannu Cantonment. Dead and injured are being airlifted . Internet & call services have been suspended in the area. Emergency declared in hospitals & leave of doctors have been cancelled. More details soon pic.twitter.com/D0kW45PC9a
— Baba Banaras™ (@RealBababanaras) March 4, 2025
పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బన్ను కంటోన్మెంట్‌లో మంగళవారం సాయంత్రం ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు పేలుడు పదార్థాలను పేల్చారు. తర్వాత కొందరు ఆయుధాలతో చొరబడి కాల్పులు చేశారు. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం.. దాడి చేసిన వారితో భద్రతా దళాలు జరిగిన ఘర్షణలో కనీసం తొమ్మిది మంది మరణించారు. 35 మంది గాయపడ్డారు. రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ముగిసిన వెంటనే కంటోన్మెంట్ ఏరియాలో ఉగ్రవాదులు అటాక్ చేశారు. ఇటీవల తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ తో చేతులు కలిపిన ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్ ఫుర్సాన్ ఈ దాడికి పాల్పడిందని భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియాలో దాడికి సంబంధించిన పేలుడు దృశ్యాలు, దట్టమైన పొగ, కాల్పుల శబ్దాలుతో వీడియోలు షేర్ చేస్తున్నారు.