/rtv/media/media_files/2026/04/12/harmuz-2026-04-12-14-44-46.jpg)
హర్మూజ్‌లో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది.. అంతేకాక పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో మూడు దేశాల (ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా) మధ్య చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలో హర్మూజ్(strait of hormuz closure) నుంచి పలు దేశాలకు చెందిన ఇంధన ట్యాంకర్లు జలసంధి దాటుకుని వెళ్లాయి. అయితే ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న చర్చలు అర్థంతరంగా ముగిశాయి. దీంతో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధి మీదుగా పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించాల్సిన రెండు అతిపెద్ద ఖాళీ సూపర్‌ట్యాంకర్లు ఈ రోజు (అదివారం) వెనక్కి మళ్లాయి. అయితే వాటికి అనుమతి లభించకపోవడంతోనే చివరి నిమిషంలో ఇవి యూటర్న్ తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Also Read : అప్పుడు బెదిరించింది.. ఇప్పుడు భయపడుతోంది: ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
Tankers Made A U-Turn - Hormuz
శనివారం రాత్రి మాల్టా పతాకంతో ఇరాక్‌కు వెళ్తున్న ‘ఆగియోస్ ఫనౌరియోస్ I’, యూఏఈలోని దాస్ ద్వీపానికి వెళ్తున్న పాకిస్థాన్ పతాకం ఉన్న ‘షాలమార్’, దక్షిణ కొరియాకు చెందిన ‘మొంబాసా బి’ అనే మరో నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి హర్మూజ్ వైపు ప్రయాణించినట్లు షిప్పింగ్ డేటా నివేదికలను బట్టి తెలుస్తోంది. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున ఇవి ఇరాన్‌లోని లారాక్ ద్వీపం సమీపానికి చేరుకున్నట్లు మీడియా తెలిపింది. అయితే ‘మొంబాసా బి’ నౌకకు మాత్రమే హర్మూజ్‌లో ప్రవేశానికి అనుమతి లభించింది. దీంతో మిగిలిన రెండు భారీ నౌకలు (Supertankers) వెనక్కి మళ్లినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
అయితే ఈ నౌకలకు అనుమతి లభించకపోవడానికి గల కారణాలపై ఎలాంటి స్పష్టమైన కారణం తెలియరాలేదు. కాగా, శనివారం రెండు చైనీస్ సూపర్‌ట్యాంకర్లు, ఒక గ్రీక్ నౌక ముడి చమురుతో హర్మూజ్(Indian ships in Strait of Hormuz) ను దాటినట్లు నివేదికలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్‌పై పట్టు మరింత పట్టు బిగించే అవకాశం ఉండడంతో గల్ఫ్ జలాల్లో వేచి ఉన్న నౌకల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది.
Also Read : అమెరికావి గొంతెమ్మ కోర్కెలు.. అందుకే పక్కన పెట్టాం.. ఇరాన్ సంచలన ప్రకటన!
Follow Us