/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/US-Visa-jpg.webp)
H1B Visa
ప్రస్తుతం అమెరికాలో హెచ్ 1 బీ వీసాదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు ఏం కారణం చెప్పి వెళ్ళిపొమ్మంటారో తెలియక బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇమ్మిగ్రేషన్, వీసాల పాలసీలను ఎడాపెడా మార్చేస్తున్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఏ కొత్త రూల్ పెడుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీంతో పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగులను హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హెచ్ 1 బీ వీసాలపై పని చేస్తున్న వారు అమెరికా వదిలి అంతర్జాతీయ ప్రయాణాలు చేయొద్దని చెబుతున్నారు. అమెరికాకు తిరిగి వచ్చే క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు స్ట్రిక్ట్ రూల్స్ చూపించి మళ్ళీ అనుమతించకపోవచ్చని అంటున్నారు. అందుకే టెక్ కంపెనీలు ఉద్యోగులకు ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేస్తున్నాయి. అమెరికాలోని ఆపిల్, గూగుల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు పైతలం ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చును.
వరుసగా మార్పులు..
గత నెలలోనే వీసాలు, ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారతాయని యూఎస్ విదేశాంగ మంత్రి రూబియో చెప్పారు. ఈ రెండింటినీ విదేశీ వ్యవహారాల కిందకు తీసుకురావాలనుకుంటున్నామని అన్నారు. అదే అయితే కనుక వీసా నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. అమెరికాలో పనిచేయాలని, చదువుకోవాలని, ఇక్కడ పర్యటించాలని అనుకొనే భారతీయులు భారీ మార్పులను చవిచూసే అవకాశం ఉంది. వీసా ఆమోదాలు, పునరుద్ధరణ విషయంలో యాజమాన్యాలు, ఉద్యోగస్తులు అంతరాయం ఎదుర్కొనే అవకాశం ఉందని రూబియో చెప్పారు. దీని వలన హెచ్-1బీ నిబంధనలు, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియపై అనిశ్చితిని పెంచుతుందన్నారు.
today-latest-news-in-telugu | usa | h1-b-visa | tech-companies
Also Read: AP: హైకోర్ట్ లో ఆర్జీవీకి ఊరట..తొందరపాటు చర్యలు వద్దు