/rtv/media/media_files/2026/02/14/tarique-rahman-2026-02-14-21-36-22.jpg)
Tarique Rahman First remarks after election win
బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఛైర్మన్ తారిక్ రెహమాన్ మొదటిసారిగా ప్రసంగించారు. దేశ ప్రయోజనాలకే తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని వ్యాఖ్యానించారు. '' ఈ గెలుపు బంగ్లాదేశ్ ప్రజలది. మనమందరం ఇప్పుడు స్వేచ్ఛను సాధించుకున్నాం. మనకు కావాల్సిన హక్కులకు అసలైన అర్థాన్ని తిరిగి పొందాం. ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసిన వాళ్లకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే దేశ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తామని'' తారిక్ రెహమాన్ అన్నారు.
Also Read: మహారాష్ట్రలో కీలక పరిణామం.. NCP విలీనం ఉండదన్న సంజయ్ రౌత్
తారిక్ గతంలోనే భారత్, చైనా సంబంధాల్లో సమతుల్యత పాటిస్తామని తెలిపారు. దీన్నిబట్టి భారత్‌తో సంబంధాలు కలుపుకునేందుకు ఆయన అనుకూలంగా వ్యవహరించనున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పాకిస్థాన్‌కు అనుకూలమైన జమాత్-ఏ-ఇస్లామీ పార్టీ ఓడిపోయింది. ఈ పార్టీని ముందునుంచే రెహమాన్ దూరం పెడుతూ వచ్చారు. దీంతో రెహమాన్ నేతృత్వంలో రానున్న కొత్త ప్రభుత్వం భారత్‌తో సానుకూలంగా వ్యవహరించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్.. ఈయన్ని డార్క్ ప్రిన్స్ అని ఎందుకంటారో తెలుసా ?
మరోవైపు భారత్ ప్రయోజనాలు గౌరవిస్తామని తారిక్ రెహమాన్ గతంలో కూడా చెప్పారు. ఇరుదేశాల నిర్ణయాలపై ఆధారపడి బంధం కొనసాగుతుందని తెలిపారు. మరోవైపు రెహమాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత్‌తో సహా ఇతర దక్షిణాసియా దేశాల నేతలకు ఆహ్వానం పంపించాలని బీఎన్‌పీ యోచిస్తోంది. ఒకవేళ ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరైతే ఇరుదేశాల మధ్య సంబంధాల్లో కీలక మార్పులు రానున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదిలాఉండగా దాదాపు 25 ఏళ్ల తర్వాత బీఎన్‌పీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 299 పార్లమెంటు స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ 209 చోట్ల విజయం సాధించింది. పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉండే మతతత్వ పార్టీ జమాత్ ఏ ఇస్లామీ 68 స్థానాల్లో గెలుపొందింది. 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి వచ్చిన మాజీ ప్రధాని ఖాలిదా జియా కొడుడు, BNP ఛైర్మన్ తారిక్ రెహమాన్ (60) బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.
Follow Us