తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించుకున్నారు. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నియంతృత్వ పాలనకు అక్కడ చరమగీతం పాడారు. దీంతో అసద్ దేశం విడిచి పారిపోయారు. ఆయన రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. ఇదంతా జరిగన తర్వాత అసద్ ఒక్కసారంటే ఒక్కసారి మాట్లాడారు. అది కూడా డైరెక్ట్‌గా కనిపించి మాట్లాడలేదు. ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తన సందేశాన్ని పంపారు. సిరియాను వదిలిపెట్టలేదని...మళ్ళీ తిరిగి దక్కించుకుంటానని చెప్పారు. డమాస్కస్‌ను తిరుగుబాటు దళాలు ఆక్రమించుకున్న క్రమంలో తాను దేశాన్ని వీడి వెళ్లిపోవాలని అనుకోలేదని సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అసద్ చెప్పారు. రష్యా బేస్ నుంచే పోరాటం చేయాలనుకున్నానని చెప్పారు. డమాస్కస్‌లో తన ఇంటి మీద, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడులు జరగడం వల్లనే రష్యా సైన్యం తనను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని చెప్పారు. ఈలోపు తిరుగుబాటుదారులు సిరియాలో స్థిరపడ్డారు. అక్కడ తమ నేతను అధ్యక్షునిగా నియమించుకుని పాలన కొనసాగిస్తున్నారు. Also Read: తెలంగాణ మంత్రుల వేలకోట్ల కుంభకోణం.. నా దగ్గర ప్రూఫ్స్: ఏలేటి సంచలనం అసద్‌పై విషప్రయోగం.. మరోవైపు సిరియాను విడిచిపెట్టిన దగ్గర నుంచీ మాజీ అధ్యక్షుడు అసద్ రష్యాలోనే ఉంటున్నారు. అయితే ఎక్కడ, ఎలా ఉంటున్నారు..ఆయనకు ఎవరు ఆశ్రయం ఇచ్చారు అన్న విషయాలు మాత్రం బయటకు రానివ్వలేదు. దాదాపు అజ్ఞాతంలో ఉన్నట్టుగానే అసద్ ఉంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం అసద్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్ర దగ్గుతో ఊపిరి ఆడక అసద్ ఇబ్బంది ఎదుర్కొన్నారని చెబుతున్నారు. పరిస్థితి క్షీణించడంతో ఆయనకు వైద్య సహాయం అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆ టైమ్‌లోనే వైద్యులు అసద్‌కు నిర్వహించిన పరీక్షల్లో విషపదార్ధాల ఆనవాళ్ళు కనిపించాయని చెబుతున్నారు. అయితే దీని మీద ఎటువంటి అధికారిక ప్రకటనా ఇవ్వలేదు. రష్యా అధికారులు కూడా ఏమీ స్పందిచలేదు. Also Read: ఆ సమాయానికి మోదీ ప్రభుత్వం ఉండకపోవచ్చు.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు