Earthquake: పెను విషాదం.. 2700కు పెరిగిన భూకంప మృతులు

మయన్మార్‌లో సంభవించిన భూకంపం పెను విషాదం సృష్టించింది. దీనివల్ల ఇప్పటిదాకా 2,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లలో 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు 50 మంది ఉన్నట్లు తెలిపాయి.

New Update
Earthquake in Myanmar

Earthquake in Myanmar

మయన్మార్‌లో  సంభవించిన భూకంపం పెను విషాదం సృష్టించింది. ఈ భూప్రళయం ధాటికి మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ప్రమాదం వల్ల ఇప్పటివరకు కలిపి 2,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లలో 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు 50 ఉన్నట్లు తెలిపాయి.  మరో 4,521 మంది గాయపడ్డారని.. 441 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుతం సైనిక పాలన, అంతర్యుద్ధాలతో కొట్టుమిట్టాడుతున్న మయన్మార్‌లో గత వారం శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. 

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!

మయన్మార్‌, థాయ్‌లాండ్‌ అనేక బిల్డింగ్‌లు ఊగిపోయాయి. మరికొన్ని ధ్వంసమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ఇప్పటికీ రెస్క్యూ బృందాలు చేరుకోలేని ప్రభావిత ప్రాంతాలు ఉండటం కలకలం రేపుతోంది. దీనివల్ల శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే వివిధ దేశాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలను పంపిస్తున్నాయి. అయితే వీళ్లు అక్కడికి వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ, తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆటంకం కలిగిస్తున్నాయి.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, షెల్టర్  అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలాఉండగా ఇప్పటికే భారత్‌..ఆపరేషన్‌ బ్రహ్మ కింద మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. టెంట్లు,దుప్పట్లు,స్లీపింగ్ బ్యాగులు జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది. అటు అమెరికా,ఇండోనేషియా,చైనా కూడా అవసరమైన సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియా -గుటెరస్‌ వెల్లడించారు.

Also Read: బంగ్లాలో పడిపోతున్న వస్త్ర పరిశ్రమ..200లకు పైగా ఫ్యాక్టరీలు క్లోజ్

rtv-news | earthquake | myanmar earthquake

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్

అమెరికా ప్రతీకార సుంకాలకు ధీటుగా చైనా కూడా 34శాతం సుంకాలను వేసింది. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్...చైనా భయపడింది అంటున్నారు. తప్పుడు నిర్ణయం తీసుకుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

New Update
Trump

చైనా భయపడింది. తప్పుడు నిర్ణయం తీసుకుంది అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వారికి మరో మార్గం లేదు అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అమెరికా టారీఫ్ లకు ప్రతిగా చైనా విధించిన 34శాతం సుంకాలపై ట్రంప్ స్పందించారు. అసలు ముందు నుంచీ చైనా గోలపెడుతూనే ఉంది. యూఎస్ విధించిన సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధమని ఆరోపించింది. అగ్రరాజ్యం ేకపక్షంగా వ్యవహరిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని చైనా అంటోంది. ట్రంప్ విధించిన సుంకాలపై ఇప్పటి వరకు కెనడా, చైనాలు మాత్రమే ధీటుగా సమాధానాలు చెప్పాయి. దానికి ప్రతిగా ఆ దేశాలు కూడా సుంకాలను పెంచాయి. తాజాగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని వస్తువులపైనా చైనా 34శాతం విధిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులకు ఇది వర్తిస్తుందని, ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయని ది స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టారిఫ్‌ కమిషన్‌ తెలిపింది. 

ప్రపంచ ఆర్ధిక మాంద్యం దిశగా?

ఇక మరోవైపు ట్రంప్‌ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయని, కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని మరింత పెరుగుతుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు.  ట్రంప్‌ ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికాతో పాటు అన్ని ప్రధాన మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి. దీనికి సంబంధించి క్యాపిటల్ మార్కెట్ కంపెనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ క్యాపిటల్ అడ్వైజర్స్ సీఈఓ జేహాట్‌ఫీల్డ్‌ మాట్లాడారు. '' ట్రంప్ ప్రకటన మార్కెట్లకు దారుణమైన పరిస్థితి. అమెరికాను మాంద్యంలోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని'' అన్నారు.  ''ఈ వ్యవహారంలో మనం ఒకవైపే చూస్తున్నాం. కానీ మనం చేసే దానికి ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ముఖ్యం. మొత్తానికి మార్కెట్ ఈ పరిస్థితులను ఎలా తీసుకుంటుందో చూడాలని'' గ్రీన్‌వుడ్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌ వాల్టర్ టాడ్ వ్యాఖ్యానించారు. 

 today-latest-news-in-telugu | usa | china | donald trump tariffs 

Also Read: TS: ఉత్తమ విద్యావస్థ కోసం కొత్త పాలసీ..సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment