Sunitha Williams: అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా కనిపించింది..సునీతా విలియమ్స్

అంతరిక్ష అనుభవాలను మీడియాతో పంచుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భారత దేశం గురించి కూడా స్పందించారు. ఇండియా మహా అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించారు. త్వరలోనే భారత్ కు వస్తానని తెలిపారు. 

New Update

ఐఎస్ఎస్ నుంచి తిరిగి వచ్చాక సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు 12 రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తాము కోలుకుంటున్నామని...నాసా బృందం తమకు శిక్షణ ఇస్తోందని చెప్పారు. ఇప్పుడు మామూలుగాను నడగలుగుతున్నామని చెప్పుకొచ్చారు. దాంతో పాటే తమ  ఐఎస్ఎస్ లో తమ అనుభవాలు, అక్కడ ఏం చేశారు. స్పేస్ ఎక్స్ పని తీరు గురించి అన్నీ వివరంగా చెప్పారు వ్యోమగాములు. మళ్ళీ అవకాశం వస్తే స్టార్ లైన్ షిప్ లో ఐఎస్ఎస్ కు వెళ్ళడానికి రెడీ అని తెలిపారు. 

ఇండియా చాలా బావుంది..

అంతరిక్షం నుంచి భారత్ ఏ విధంగా కనిపించింది అన్న ప్రశ్నకు సునీతా విలియమ్స్...అద్భుతంగా ఉంది అంటూ సమాధానం చెప్పారు. భారతదేశ ప్రకృతి దృశ్యాన్ని చూసి ముగ్ధురాలైనట్లు తెలిపారు. హిమాలయాలను దాటుకుని వెళుతుంటే మైమరిచిపోయానని సునీతా అన్నారు.  ఆ దృశ్యాలను బెచ్ విల్ మోర్ కెమెరాలో బంధించామని తెలిపారు. గుజరాత్, ముంబై ప్రాంతాల మీదగా వెళ్లినప్పుడు జాలర్ల పడవలు సిగ్నల్‌లాగా కనిపించాయని అన్నారు. భారత్ లో తొందరలోనే పర్యటిస్తానని సునీతా అన్నారు. తన తండ్రి పుట్టిన దేశాన్ని త్వరలోనే చూస్తానని, బంధువులను, ప్రజలను కలుస్తానని సునీతా చెప్పారు. భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమని కొనియాడారు. భారత అంతరిక్ష యాత్రలో భాగం కావడానికి, సాయం చేయడానికి తాను సిద్దమేనని ఆమె అన్నారు. 

today-latest-news-in-telugu | nasa | sunitha-williams | astronauts

Also Read: Myanmar: మసీదుల్లో ప్రార్థన చేస్తూ 700 మంది మృత్యువు.. 2వేలకు పైనే..

Advertisment
Advertisment
Advertisment