/rtv/media/media_files/2025/03/16/MjmVZ7D7o8RYq5U9yXb8.jpg)
Sunita Williams
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు గత ఏడాది అంతరిక్ష కేంద్రానికి(ISS) వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. చివరికి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ తాజాగా అక్కడికి వెళ్లి ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఇద్దరు భూమి మీదకు వచ్చే మార్గం సుగమమైంది. అయితే ఇప్పుడు ఈ వ్యోమగాముల జీతభత్యాలు ఎంత, ఎక్కువ కాలం అంతరిక్షంలో ఉండిపోయినందున నాసా వీళ్లకు అదనంగా చెల్లిస్తుందా అనేది ఆసక్తిగా మారింది.
Also Read: రన్యా రావుతో ఇద్దరు మంత్రులకు లింక్..బీజేపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
అంతరిక్షంలో నిర్దేశిత సమయం కంటే ఎక్కువ కాలం ఉండే వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవు. ఈ విషయాన్ని నాసా విశ్రాంత వ్యోమగామి క్యాడీ కోల్‌మన్ చెప్పారు. ఫెడరల్ ఉద్యోగులు కావడం వల్ల అంతరిక్షంలో వాళ్లు పనిచేసినప్పటికీ కూడా భూమిపై సాధరణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని పేర్కొన్నారు. అయితే సాధారణంగా వచ్చే శాలరీతో పాటు ఐఎస్‌ఎస్‌లో ఆహారం, బస ఖర్చులను మాత్రం నాసా భరిస్తుందని తెలిపారు.
ఏవైనా ఇలాంటి అనుహ్య పరిణామాలు జరిగినప్పుడు అదనంగా రోజుకు నాలుగు డాలర్లు (దాదాపు రూ.348) మాత్రమే వచ్చే ఛాన్స్ ఉందన్నారు. 2010-11లో మిషన్‌లో భాగంగా 159 రోజులు పాటు ఐఎస్‌ఎస్‌లో ఉన్నానని.. అప్పుడు తనకు 632 డాలర్లు మాత్రమే అదనంగా చెల్లించినట్లు చెప్పారు. దీన్నిబట్టి చూస్తే సునీతా విలియమ్స్‌కు, బుచ్ విల్మోర్ తొమ్మిది నెలలు స్పేస్‌లో ఉన్నందుకు దాదాపు 1100 డాలర్లు (సుమారు రూ.లక్ష) మాత్రమే అదనంగా పొందే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Also Read: గ్రూప్ 1 ఫలితాలపై అనుమానాలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు
జీతం ఎంతంటే ?
జీతం పరంగా చూస్తే నాసా ఉద్యోగులు.. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతాన్నే పొందుతారు. అయితే వ్యోమగాములకు జనర్ షెడ్యూల్ జీఎస్-13 నుంచి జీఎస్-15 కింద చెల్లింపులు ఉంటాయి. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు జీఎస్-15 గ్రేడ్ పే శాలరీ తీసుకుంటున్నారు. దీని ప్రకారం చూస్తే వార్షిక వేతనం 1,24,133 డాలర్ల నుంచి 1,62,672 డాలర్ల (రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41 కోట్లు) మధ్య ఉంటుంది.