NASA: అంతరిక్షంలో సునీతా విలియమ్స్ సేఫ్..క్రిస్మస్ వేడుకలు..

అంతరిక్షలో చిక్కుకుపోయిన వ్యోమగామలు సేఫ్‌గా ఉన్నారు. వారు ఈరోజు అక్కడ క్రిస్మస్ సంబరాలను చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నాసా తన ఎక్స్‌ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేసింది. 

author-image
By Manogna alamuru
New Update
space

Sunitha Williams Christmas Photograph: (NASA)

ఈ ఏడాది జూన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌లు.. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వారక్కడే ఉన్నారు. ఇద్దరు వ్యోమగాములను తీసుకురావడానికి నాసా చాలా ప్రయత్నించింది అయితే అది అవలేదు. మొదట ఫిబ్రవరిలో వారిని తీసుకువస్తామని నాసా చెప్పింది. ఎలాన్ మస్క్‌కు సంబంధింఇన స్పేస్ ఎక్స్ రాకెట్లో తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. అయితే తాజాగా  వచ్చే ఏడాది మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌ మొదటివారంలో వ్యోమగాములను భూమిని చేరుకునే అవకాశముందని నాసా మళ్​ళీ ప్రకటించింది. 

క్రిస్మస్ వేడుకలు...

ఈ క్రమంలో అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు ఆరోగ్యం మీద అనేక అనుమానాలు తలెత్తాయి. వారు చనిపోతారని ఆందోళనలు తలెత్తాయి. అయితే నాసా వీటన్నిటికీ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది. వ్యామగాముల ఆరోగ్యం మీ శ్రద్ధ తీసుకుంటున్నామని...ఎపటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెబుతూనే ఉంది. వ్యోమగాముల ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంది. తాజాగా సునీతా విలియమ్స్, మిగతా వారు స్పేస్‌లో క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటున్న వీడియోను తన ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో పోస్ట్ చేసింది నాసా. ఇందులో సునీతా మాట్లాడారు కూడ. తామందరం బాగానే ఉన్నామని..క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నామని తెలిపారు. భూమి మీద ఉన్నవారందరికీ వ్యోమగాములు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 

 

Also Read: Kambli: సచిన్‌కు థాంక్స్...కోలుకుంటున్న మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

అగ్రరాజ్యం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. టారీఫ్ లకు సంబంధించి ట్రంప్ సర్కార్ ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. చైనా మినహా మిగతా అన్ని దేశాలపైనా టారీఫ్ లను 90 రోజుల పాటూ నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

New Update
Donald Trump

Donald Trump

మొత్తానికి అమరికా ప్రభుత్వం దిగొచ్చింది. టారీఫ్ లపై ఇంచుమించు అన్ని దేశాలూ వ్యతిరేకత వ్యక్తం చేస్తుండడంతో వెనక్కు తగ్గడమే మంచిది అనుకున్నట్టుంది. మొత్తానికి టారీఫ్ లపై కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఊరట కలిగించింది. దాదాపు వార రోజుల పాటూ ట్రంప్ టారీఫ్ లతో బెంబేలెత్తిపోయిన ప్రపంచం ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. అమెరికా అధ్యక్షుడు మొదలెట్టిన ఈ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ మార్కెట్ అంతా అతలాకుతలం అయిపోయింది. షేర్ మార్కెట్ అయితే ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చూసింది.  ఇప్పుడు ఈ 90 రోజుల నిలుపుదలతో అందరూ కాస్త ఊరట చెందుతారు.

చైనాకు మాత్రం లేదు..

అయితే ఈ 90 రోజుల నిలుపుదల చైనాకు మాత్రం వర్తించదని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య మరింత ముదిరినట్టయింది.  ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనాపై యూఎస్ సుకాలు పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఒక్కరోజు తేడాలోనే చైనాపై యూఎస్‌ మరోసారి సుంకాలు పెంచింది. 104 నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. చైనా కూడ తగ్గేదే లే అన్నట్టు ప్రవర్తిస్తోంది. అంతకుముందు అమెరికాకు ప్రతిగా ఆ దేశం కూడా అమెరికా వస్తువులపై 84 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మరోసారి డ్రాగన్‌పై సుంకాలు 125శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. 

today-latest-news-in-telugu | usa | donald trump tariffs

Also Read: GT VS RR: గుజరాత్ ఖాతాలో వరుసగా నాలుగో విజయం

Advertisment
Advertisment
Advertisment