/rtv/media/media_files/2026/04/16/student-2026-04-16-08-00-41.jpg)
Student kills 9 in Turkey's second school shooting in 2 days
తుర్కియేలో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో రెండు తరగతి గదుల్లో ఓ విద్యార్థి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో టీచర్‌తో సహా తొమ్మిది మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీళ్లలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తుర్కియే అంతర్గత వ్యవహారాల మంత్రి ముస్తఫా వెల్లడించారు. గత రెండ్రోజుల్లో తుర్కియేలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి.
Also Read: ట్రంప్ చమురు దెబ్బ.. ఇరాన్‌కు రోజుకు రూ. 4 వేల కోట్ల నష్టం!
కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లో ఉన్న పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణానికి పాల్పడ్డ విద్యార్థి తండ్రి రిటైర్డ్ పోలీసు అధికారి అని తెలిసింది. బాలుడు అయిదు తుపాకులు, ఏడు మ్యాగజైన్‌లతో స్కూల్‌కు వచ్చి ఈ దాడికి పాల్పడ్డట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఆ విద్యార్థి కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడే కాల్చుకున్నాడా ? లేదా పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్ అయ్యాడా అనేదానిపై క్లారిటీ లేదు.
Also Read: ప్రపంచ ప్రజలకు గుడ్ న్యూస్.. చమురు ధరలు భారీగా తగ్గుతాయన్న ట్రంప్
ఇదిలాఉండగా మంగళవారం శాన్లియుర్ఫా ప్రావిన్సులో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. ఓ ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థి కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటనలో 16 మంది గాయపడ్డారు. మరుసటి రోజే ఈ దారుణం జరగడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో పాఠశాల విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు.
Follow Us