ఇంధన సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక.. అమల్లోకి రేషన్ విధానం..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం చమరు సంక్షోభానికి దారి తీసింది. ఆసియాలో చాలా దేశాల్లో ఇంధన, చమురు కొరత ఏర్పడింది. ముఖ్యంగా శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి.

New Update
Sri Lanka switches to QR code based system to ration fuel sales

Sri Lanka switches to QR code based system to ration fuel sales

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం చమరు సంక్షోభానికి దారి తీసింది. ఆసియాలో చాలా దేశాల్లో ఇంధన, చమురు కొరత ఏర్పడింది. ముఖ్యంగా శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. అక్కడ ధరలు పెంచకున్నా వాహనాలకు పెట్రోల్, డిజీల్‌ పోయడంపై రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అంటే క్యూఆర్‌ కోడ్ ఆధారంగా వాహనాలకు వారానికి పెట్రోల్, డీజిల్‌ పోయడంపై పరిమితి విధించారు.

శ్రీలంక తమ ఇంధన అవసరాల కోసం విదేశాల పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఒక్క హర్మూజ్ జలసంధి నుంచే శ్రీలంక 80 శాతం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం వల్ల ఈ రూట్‌కు అంతరాయం ఏర్పడటంతో చాలావరకు నౌకలు ఆగిపోయాయి. దీంతో శ్రీలంకలో ఆయిల్ నిల్వలు భారీగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలోనే రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.    

Also Read: వాహనదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

రేషన్ విధానం 

బైక్ / టూ వీలర్: వారానికి 8 లీటర్ల పెట్రోల్ పోయనున్నారు 
ఆటోలు: వారానికి 20 లీటర్లు పెట్రోల్ లేదా డీజిల్
కార్లు: వారానికి 25 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్
బస్సులు: వారానికి 100 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్
లారీలు: వారానికి 200 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్

Also Read: ఇరాన్ దెబ్బ.. గల్ఫ్‎లో 13 అమెరికా స్థావరాలు ధ్వంసం..

శ్రీలకం సర్కార్‌ వాహనాల నెంబర్లతో QR కోడ్‌ను రిలీజ్ చేసింది. పెట్రోల్‌ బంకుల్లో ఈ కోడ్ స్కాన్ చేయగానే ఆ వెహికిల్ ఎప్పుడు ఆయిల్ కొట్టించుకుంది అనేది తెలుస్తుంది. దీనివల్ల ఆ వాహనానికి మళ్లీ మళ్లీ పెట్రోల్ లేదా డీజిల్‌ పోయడం అనేది కుదరదు. వారం తర్వాతే ఆయిల్ పోయించుకావాల్సి ఉంటుంది. ప్రస్తుతం శ్రీలంకలో 2 కోట్ల 20 లక్షల మంది జనాభా ఉన్నారు. అక్కడ 25 రోజులకు సరిపడా చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఉన్న నిల్వలను జాగ్రత్తగా వాడుకునేందుకు రేషన్ విధానాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి బుధవారం కూడా ప్రభుత్వ ఆఫీసులు, పాఠశాలలు, కాలేజీలు మూసివేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చమురు నిల్వలు ఆదా అవుతాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు