Deep Seek- South Korea: డీప్‌సీక్‌ పై దక్షిణ కొరియా నిషేధం!

ఏఐ రంగంలో తాజా సంచలనం చైనాకు చెందిన డీప్‌సీక్ ఒక వైపు దూసుకెళ్తుంది.మరో వైపు దీని పై అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. దీని వాడకం పై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించగా..తాజాగా ఆ జాబితాలో దక్షిణ కొరియా కూడా చేరింది

New Update
deepseek

deepseek

ఏఐ రంగంలో తాజా సంచలనం చైనాకు చెందిన డీప్‌సీక్ ఒక వైపు దూసుకెళ్తుంది.మరో వైపు దీని పై అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. దీని వాడకం పై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించగా..తాజాగా దక్షిణ కొరియా సైతం ఆ జాబితాలో చేరింది.ఆ దేశ వాణిజ్య కంప్యూటర్లలో డీప్‌సీక్‌ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Trump-Panama: పనామా పై ట్రంప్‌ పంతమే నెగ్గింది..ఇక అమెరికాకు ఉచితం!

డీప్‌సీక్‌ వినియోగం పై పలు దేశాల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలోనే దాన్ని నిషేధించాలని నిర్ణయించుకున్నాం. ఇంటెలిజెన్స్‌ అధికారులు దీని వినియోగంలో జాగ్రత్తలు వహించాలి. యూజర్లకు చెందిన వ్యక్తిగత సమాచార సేకరణ వ్యవస్థకు సంబంధించిన వివరాలు అస్పష్టంగా ఉన్నాయని రక్షణ, వాణిజ్య మంత్రిత్వశాఖలు సంయుక్తంగా తెలిపాయి.

Also Read: Trump Effect: ట్రంప్‌ ఆఫర్‌ ఎఫెక్ట్‌.. ఏకంగా 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా!

ఆ దేశ పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా ఇదే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.అమెరికాలో నిషేధం ఎదుర్కొన్న చైనా ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీతో డీప్‌సీక్‌ కు సంబంధాలు ఉన్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.కంప్యూటర్‌ కోడ్‌ ద్వారా యూజర్లకు చెందిన లాగిన్‌ సమాచారాన్ని ఆ టెలికాం సంస్థకు చేరవేస్తోందని చెబుతున్నారు.

తొలుత కెనడాకు చెందిన ఫీరూట్‌ సెక్యూరిటీ సంస్థ దీన్ని గుర్తించి అసోసియేట్‌ ప్రెస్‌వార్తా సంస్థతో పంచుకుంది. ఈ వివరాలను స్వతంత్ర కంప్యూటర్‌ నిపుణులు ధ్రువీకరించారు.అయితే డేటా బదిలీ జరిగిందా? లేదా అన్నది మాత్రం ఈ సంస్థలు గుర్తించలేదు. ఈ ఆరోపణలపై అటు డీప్‌ సీక్‌ గానీ, చైనా మొబైల్‌ గానీ స్పందించలేదు. 

ఆస్ట్రేలియా, ఇటలీ,తైవాన్‌...

ఈ నేపథ్యంలో డీప్‌సీక్‌ సేవలపై ఆస్ట్రేలియా, ఇటలీ,తైవాన్‌ దేశాలు ఇప్పటికే నిషేధం విధించాయి.ప్రభుత్వ కంప్యూటర్లు,డివైజుల వాడకంపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. వ్యక్తిగత డివైజులపై  మాత్రం ఎలాంటి నిషేధం లేదు.డీప్‌ సీక్‌ వాడకం పై అప్రమత్తంగా ఉండాలని పౌరులకు అక్కడి ప్రభుత్వం సూచించింది. 

ప్రైవసీ పై ఆందోళనలు పరిష్కరించడంలో డీప్‌సీక్‌ విఫలం అయిన నేపథ్యంలో దేశంలో చాట్‌బాట్‌ ను బ్లాక్‌ చేస్తున్నట్లు ఇటలీ డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ వెల్లడించింది. ప్రభుత్వ  సంస్థల్లో డీప్‌సీక్‌ వినియోగాన్నినిషేధిస్తూ తైవాన్‌ కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది.

Also Read: ఆమే నా సీరియస్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ అంటూ పాలాహర్డ్‌తో ప్రేమాయణం గురించి తొలిసారి నోరు విప్పిన Bill Gates

Also Read: Tamannaah: విజయ్‌ తో తమన్నా బ్రేకప్‌?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు