/rtv/media/media_files/2025/03/04/U5wEIAb2ITKmirZUZLYq.jpg)
Serbia Parliament
అది పార్లమెంటా...లేక సంత నా అన్నట్టు తయారు చేశారు సెర్బియా ఎంపీలు. యూనివర్సిటీ విద్యకు నిధులు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై పార్లమెంటులో చర్చ జరిగింది. దీనిపై ఓటింగ్ సమయంలో రచ్చ రచ్చ చేశారు. స్మోక్ బాంబులతో దాడులు చేసుకున్నారు. వీటితోపాటు కోడిగుడ్లు, వాటర్ బాటిళ్లనూ చట్టసభ సభ్యులు విసురుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు ఎంపీలకు గాయాలు కాగా అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అధికా పార్టీ తమకు వ్యతిరేకంగా చాల నిర్ణయాలను ఆమోదించే యోచనలో ఉంది అంటూ ప్రతిపక్షం గొడవ చేసింది. ఇది చట్టవిరుద్ధమని, ప్రధాని మిలోస్ వుచెవిక్ రాజీనామాను వెంటనే ఆమెదించాలని డిమాండ్ చేశారు. బ్యానర్లు చేతపట్టి, నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు నిరసనలకు దిగారు.
అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవ..
దీంతో అధికార, విపక్షాలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది అక్కడితో ఆగకుండా గొడవకు దారితీసింది. అదే సమయంలో కొందరు స్మోక్ బాంబులను విసరడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరికొందరు కోడిగుడ్లు, నీళ్ళబాటిళ్ళు కూడా విసురుకుంటూ గొడవను మరింత పెద్ది చేశారు. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన స్పీకర్ అనా బ్రనాబిక్.. ప్రతిపక్షాలను ఉగ్రవాద ముఠాలుగా అభివర్ణించారు. ఈ హొత్తం ఘటనలో ముగ్గురు ఎంపీలకు తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇక సెర్బియాలోని నోవీసాడ్ నగరంలో లాస్ట్ ఇయర్ నవంబర్‌లో ఓ రైల్వేస్టేషన్ ముఖద్వారం పైకప్పు కూలి 15 మంది మరణించారు. అప్పటి నుంచి విద్యార్థులు అవినీతి నిర్మూలన ఉద్యమం చేపట్టారు. ఇది ఉద్ధృత రూపు దాల్చడంతో.. ప్రధానమంత్రి మిలోస్ వుచెవిచ్ రాజీనామా చేశారు. అయితేదీన్ని పార్లమెంటు ఇంకా ఆమోదించాల్సి ఉంది. 30 రోజుల్లో ఆమోదించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచడమా లేక మధ్యంతర ఎన్నికలు జరిపించడమా అన్నది తేల్చాల్సి ఉంది.
Also Read: HYD: నీ పాపం పండుతుంది.. బైక్ ఓనర్ కు 'x ' లో హైదరాబాద్ పోలీసుల వార్నింగ్!