/rtv/media/media_files/2025/03/29/oKW6fWs5hbZi3SJ6DqrT.jpg)
Mynmar Earth Quake
మయన్మార్ లో శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం వచ్చి రెండు రోజులు గడిచిపోయింది. మృతదేహాలను బయటకు తీస్తూనే ఉన్నారు. మరోవైపు శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి రక్షించే ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంత మంది బతికున్నారో అనేది అనుమానంగా మారింది. తమవారు సజీవంగా ఉండొచ్చనే ఆశతో అనేకమంది తమ చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇంకా చాలా ప్రాంతాల్లో అసలు సహాయక చర్యలు మొదలవ్వనే లేదు. దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. దానికి తోడు మృతదేహాల నుంచి వచ్చే దుర్గంధం మొత్తం వ్యాపిస్తోందని చెబుతున్నారు.
సహాయక బృందాలు వెళ్ళలేకపోతున్నారు..
మయన్మార్ లో చాలాచోట్లకు సహాయక బృందాలు చేరుకోలేదు. ముఖ్యంగా మాండలేలో భారీ భవనాలు, ఆధ్యాత్మిక, పర్యటక ప్రదేశాలతోపాటు అనేక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కూలిపోవడం, రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో అక్కడి దాకా చేరుకోలేకపోతున్నారు. దీంతో స్థానికులు చేతులతోనే సహాయక చర్యలు చేస్తున్నారు. ఉత్త చేతులతోనే శిథిలాలను తెలిగిస్తున్నారు.
వీధుల్లో ప్రజలు...
మయన్మార్ ను భూకంప భయం వదలడం లేదు. రెండు రోజులుగా భూమి ప్రకంపిస్తూనే ఉంది. ఈరోజు కూడా టోంగా అనే ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీంతో అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఎప్పుడు ఏమవుతోంది తెలియక వీధుల్లోనే ఉంటున్నారు. మరోవైపు అంతకు ముందు వచ్చిన భూకంపానికి చాలా ఇళ్ళు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీంతో అవి ఎప్పుడూనా కూలిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. దీంతో 15 లక్షల జనాభా ఉన్న మాండలేలో చాలావరకు ప్రజలు రాత్రి వేళల్లో వీధుల్లోనే నిద్రపోతున్నారు.
today-latest-news-in-telugu | earth-quake | rescue
Also Read: Shane Warne: షేన్ వార్న్ మృతిపై అనుమానాలు..బెడ్ రూమ్ లో మిస్టరీ డ్రగ్?