Texas :టెక్సాస్ లో కాల్పులు - ముగ్గురు మృతి, 14 మందికి గాయాలు

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక బార్‌లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 14 మంది గాయపడ్డారు. ఆస్టిన్ నగరంలోని సిక్త్స్ స్ట్రీట్ సమీపంలోని 'బ్యూఫోర్డ్స్' బార్ లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

New Update
FotoJet (9)

Shooting in Texas - Three dead, 14 injured

 Texas : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక బార్‌లో జరిగిన ఘోర కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 14 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆస్టిన్ నగరంలోని వినోద కేంద్రంగా పేరుగాంచిన సిక్స్త్ స్ట్రీట్ (6th Street) సమీపంలోని 'బ్యూఫోర్డ్స్' (Buford's) అనే పాపులర్ బీర్ గార్డెన్/బార్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. బార్‌లో కాల్పులు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.

మార్చి 1, 2026 (ఆదివారం) తెల్లవారుజామున సుమారు 2:00 గంటల సమయంలో బార్ మూసివేస్తున్న తరుణంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి.ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో అక్కడ ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు నిమిషం లోపే అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపైకి నిందితుడు ఎదురుకాల్పులు జరిపాడు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో దుండగుడు మరణించాడు. మరణించిన ముగ్గురిలో ఒకరు నిందితుడేనని అధికారులు ధృవీకరించారు. మరో14 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మరణించిన వారితోపాటు గాయపడిన వారి వివరాలను ఇంకా బహిరంగపరచలేదు.


దుండగుడు ఎందుకు ఈ దాడులకు పాల్పడ్డాడు అనే విషయంపై ఆస్టిన్ పోలీస్ చీఫ్ లిసా డేవిస్ విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు