/rtv/media/media_files/2026/05/14/ship-seized-off-uae-coast-2026-05-14-18-31-45.jpg)
Ship seized off UAE coast, heading towards Iran
అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో వాణిజ్య నౌకలే టార్గెట్‌గా దాడులు జరగడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. UAEలోని ఫుజైరా ఓడరేవుకు ఈశాన్యంగా 70 కిలోమీటర్ల దూరంలో లంగరు వేసి ఉన్న ఓ నౌకను గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ సముద్ర భద్రతా సంస్థ (UKMTO) వెల్లడించింది. అయితే ఆ నౌకను ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి దగ్గర్లో జరిగిన ఈ పరిణామం సముద్ర భద్రతపై మళ్లీ నీలి నీడలు కమ్ముకునేలా దారితీసింది.
Also Read: ఢిల్లీలో వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ .. త్రిపుర సంచలన నిర్ణయం!
ఇదిలాఉండగా బుధవారం ఒమన్ తీరంలో భారతీయ జెండాతో వెళ్తున్న 'హాజీ అలీ' అనే సరుకు రవాణా నౌక డ్రోన్ దాడికి గురింది. ఆ తర్వాత అది సముద్రంలో మునిగిపోయింది. గుజరాత్‌కు చెందిన ఈ నౌక.. సోమాలియా నుంచి షార్జాకు పశువులను తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో నౌకలో ఉన్న 14 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ తీర రక్షక దళం కాపాడింది. మరోవైపు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. నౌకపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలను, అమాయక నావికులను టార్గెట్ చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Also Read: సీఎం విజయ్ మరో సంచలనం.. దెబ్బకు పెరిగిన జీతాలు.. 16 లక్షల మందికి గుడ్ న్యూస్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో హర్మూజ్ జలసంధిలో చైనా సూపర్ ట్యాంకర్‌పై కూడా దాడుల ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. 'యువాన్ హువా హు' అనే చైనా ముడి చమురు ట్యాంకర్ గత రెండు నెలలుగా గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుంది. అయితే తాజాగా ఆ నౌక జలసంధిని దాటింది. ఇరాన్ నౌకలపై అమెరికా నౌకాదళం దిగ్బంధనం కొనసాగిస్తున్న నేపథ్యంలో చైనా ట్యాంకర్లు ముందుకు కదలడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us