Pakistan: ఇరాన్‌కు సాయం చేస్తున్న పాకిస్థాన్ ?.. అమెరికాకు వెన్నుపోటు..

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఆపేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్.. అమెరికాకు వెన్నుపోటు పొడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు సాయం చేస్తూ అమెరికా ప్రయోజనాలకు గండి కొడుతోందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Shehbaz Sharif Ditching Trump? Pakistan Opens 6 Routes To Iran Amid US Blockade

Shehbaz Sharif Ditching Trump? Pakistan Opens 6 Routes To Iran Amid US Blockade

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఆపేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్.. అమెరికాకు వెన్నుపోటు పొడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌కు సాయం చేస్తూ అమెరికా ప్రయోజనాలకు గండి కొడుతోందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా రక్షణ శాఖ నిపుణుడు డెరెక్ జె గ్రాస్‌మాన్ దీనికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. హార్మూజ్ జలసంధిపై అమెరికా దిగ్బంధనం నుంచి తప్పించుకుని ఇరాన్ తన వాణిజ్యాన్ని కొనసాగించేలా పాకిస్తాన్ ఆరు ప్రత్యేక భూ మార్గాలు ప్రతిపాదించినట్లు తెలిపారు. ఈ చర్యలు అమెరికా వ్యూహాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. 

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసి అణు ఒప్పందానికి ఒప్పించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హర్మూజ్ జలసంధితో సహా ఇరాన్ ఓడరేవులను సైతం అమెరికా దిగ్బంధించింది. ఇప్పటికే ఇరాన్ నుంచి ఇతర దేశాలకు వాణిజ్య సరఫరా చాలావరకు ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పాకిస్థాన్‌ ఇరాన్‌కు కొత్త రూట్లను ప్రతిపాదించినట్లు ఆరోపణలు రావడం ప్రాధన్యం సంతరించుకుంది. ఈ కొత్త మార్గాల నుంచి చైనా, రష్యా లాంటి దేశాలకు ఇరాన్ తమ చమురు, ఇతర ఉత్పత్తులను అమెరికా కళ్లుగప్పి ఎగుమతి చేసే ఛాన్ ఉంది. ఇప్పటికే దాదాపు 3 వేల ట్రక్కులు కొత్త రూట్‌లలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

Also Read:  పశ్చిమ బెంగాల్‌లో TMCదే అధికారం.. సునీల్‌ మౌర్య సంచలన సర్వే

పాకిస్థాన్ ఓవైపు అమెరికాతో స్నేహం చేస్తూనే మరోవైపు ఇరాన్‌కు వాణిజ్యపరంగా సహకారం అందించడం చర్చనీయాంశమవుతోంది. ఇది పాక్ ద్వంద్వ నీతికి నిదర్శనమని నిపుణులు విమర్శలు చేస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చల విషయంలో కూడా పాకిస్థాన్‌కు మధ్యవర్తిత్వం వహించే అర్హత లేదని చెబుతున్నారు. ఒకవేళ ఇరాన్ ఆర్థికంగా పుంజుకుంటే అమెరికా అమలు చేస్తున్న ఆంక్షలకు విలువ లేకుండా పోతుందని అంటున్నారు.   

మరోవైపు ఈ పరిణామాలపై ఇజ్రాయెల్, ఇరాన్‌ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్థాన్‌ ఇరాన్‌కు సహకరిస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అమెరికా ఏజెంట్‌గా పాక్ పనిచేస్తోందని ఇరాన్ అనుమానిస్తోంది. పాకిస్థాన్‌ ఇరాన్‌కు కొత్త మార్గాలు ప్రతిపాదించడంతో ఆ దేశం ఎవరికి సపోర్ట్ చేస్తుందో తేలిపోయింది. అంతర్జాతీయ దౌత్య రంగంలో అమెరికాకు పాక్ వెన్నుపోటు పొడవడమేనని రక్షణ నిపుణులు అంటున్నారు. అయితే ఈ ప్రచారంపై ఇప్పటిదాకా అమెరికా అధికారులు స్పందించలేదు. 

Also Read: అమెరికాకు బిగ్‌షాక్‌...NPT సమావేశానికి ఉపాధ్యక్షుడిగా ఇరాన్‌

Advertisment
తాజా కథనాలు