/rtv/media/media_files/2026/05/10/senior-sri-lankan-monk-arrested-for-alleged-child-sex-crimes-2026-05-10-16-46-16.jpg)
Senior Sri Lankan monk arrested for alleged child sex crimes
శ్రీలంకలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసి 15 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. 71 ఏళ్ల పల్లెగామ హేమరథ అనే బౌద్ధ సన్యాని ఓ ప్రసిద్ధ బౌద్ధ ఆలయానికి ప్రధాన భిక్షువుగా ఉన్నారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డరన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు శనివారం ఆయన్ని అరెస్టు చేశారు. ఆలయ ఆవరణలోనే సదరు బాలికను అపహరించి, అక్రమంగా నిర్బంధించినట్లు గత మార్చిలోనే పోలీసులకు ఫిర్యాదు అందింది.
Also Read: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు.. పుతిన్ సంచలన ప్రకటన
ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేపట్టిన అధికారులకు ఊహించని నిజాలు వెల్లడయ్యాయి. సొంత కూతురుపై జరుగుతున్న ఈ దారుణానికి ఆ బాలిక తల్లి కూడా సహకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో హేమరథనతో పాటు ఆ బాలిక తల్లిపై కూడా అనురాధపురలోని మేజిస్ట్రేట్ కోర్టు అరెస్టు వారెంటు జారీ చేసింది.
Also Read: పాకిస్థాన్‌లో మళ్లీ ఉగ్రదాడి.. 12 మంది మృతి
ఈ క్రమంలోనే కొలంబోలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న బౌద్ధ సన్యాసి హేమరథనను, అతనికి సహకరించిన బాలిక తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంకలో అత్యంత పవిత్రంగా భావించే ఆధ్యాత్మిక ప్రదేశంలో, ఓ మతపెద్ద ఇలాంటి అసభ్యకర పనికి పాల్పడటం కలకలం రేపుతోంది. ఆ బౌద్ధ సన్యాసిని శిక్షించాలంటూ అక్కడున్న స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Follow Us