/rtv/media/media_files/2025/03/17/OH11MdmN2ijsg0ZytUOC.jpg)
Jamiat Ulema-e-Islam Leader Mufti Abdul Baqi Noorzi
Pakistan Airport: పాకిస్థాన్‌లో ఇస్లామిక్ పండితుడు, జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం నేత ముఫ్తీ అబ్దు్‌ల్ బాకీ నూర్జాయ్‌పై దాడి జరిగింది. ఆదివారం రాత్రి పాకిస్థాన్‌లోని క్వెట్టా ఎయిర్‌పోర్టులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులకు పాల్పడ్డారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అయితే క్వెట్టా ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిలో ముఫ్తి అబ్దుల్ బాకీ మరణించినట్లు పాక్ జర్నలిస్టు అర్జూ కజ్మీ తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
🚨Mufti Abdul Baqi Noorzai was killed when some armed men opened fire at him at the #Quetta airport on Sunday night. #UnknownGunMan pic.twitter.com/sU5OjVuP8d
— Arzoo Kazmi|आरज़ू काज़मी | آرزو کاظمی | 🇵🇰✒️🖋🕊 (@Arzookazmi30) March 16, 2025
Also Read: విదేశీ పాడ్‌కాస్ట్‌లో మోదీ.. కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు ఆదివారం రాత్రి క్వెట్టా ఎయిర్‌పోర్టు రోడ్డులో ముఫ్తీ అబ్దుల్‌పై దాడి జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. అతనిపై కాల్పులు జరిపి పారిపోయారని.. ఆ తర్వాత ఆయన్ని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొంది.
Also Read: మాజీ అనొద్దు ఫ్లీజ్..మేమింకా విడిపోలేదు....సైరాభాను ఆసక్తికర వ్యాఖ్యలు
ఇదిలాఉండగా..
ముఫ్తీ అబ్దుల్ బాఖీకి ముందు భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ సన్నిహితుడు అబూ కటల్ హత్యకు గురయ్యాడు. పంజాబ్‌లోని జీలం జిల్లాలో గుర్తు తెలియని దుండగులు అతడిని కాల్చి చంపారు. అబూ బటల్ ఉగ్రసంస్థ అయిన లష్కరే తోయిబాలో కీలకమైన సభ్యుడిగా ఉన్నారు. హఫీజ్ అతడిని లష్కరే తోయిబా ఆపరేషనల్ కమాండర్‌గా నియమించాడు. కొత్త వాళ్లని తమ సంస్థలోకి తీసుకొని ఉగ్రవాదులుగా మార్చడం, సరిహద్దులు దాటి చొరపడే ఆపరేషన్‌లు నిర్వహించడం అతడి బాధ్యత. అంతేకాదు రాజౌరి, రియాసి బస్సు దాడులకు కూడా అబూ కటల్ ప్రధాన సూత్రధారిగా ఉన్నారు.
Also Read: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ
Also Read: మాజీ అనొద్దు ఫ్లీజ్..మేమింకా విడిపోలేదు....సైరాభాను ఆసక్తికర వ్యాఖ్యలు