/rtv/media/media_files/2025/04/05/Oo61tPjjmBaMpBacb03a.jpg)
Russia Attack on Ukraine
రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా దాడులకు పాల్పడింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరమై క్రీవీ రిపై శుక్రవారం రష్యా మిసైల్‌తో దాడి చేసినట్లు కీవ్ అధికారులు తెలిపారు. పిల్లలు ఆడుకునే సమీపంలో ఈ దాడి జరగడంతో 18 మృతి చెందారు. వీళ్లలో 9 మంది చిన్నారులే ఉన్నారు. మరో 60 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఐదు అపార్ట్‌మెంట్ భవనాలు కూడా దెబ్బతిన్నాయి.
Also Read: అఘోరీ బాగోతం బట్టబయలు చేసిన వర్షిణీ పేరెంట్స్.. సంచలన వీడియో!
ఈ దాడులపై జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. '' ఈ దాడులు ప్రమాదవశాత్తు జరగలేదు. ఎక్కడ దాడులు చేస్తాన్నారనేది వాళ్లకి కచ్చితంగా తెలుసు. రష్యా ఉద్దేశపూర్వకంగానే క్రీవీరిలో ఇంధన సౌకర్యాలు ఉండే ప్రాంతంపై మిసైల్‌ను ప్రయోగించింది. దీంతో రష్యా అమెరికాతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని విస్మరించింది. ఉక్రెయిన్‌లో శాంతి కోసం కృషి చేస్తామని రష్యన్లు చేసిన వాగ్దానాలు ఈ దాడులతో ముగిసిపోయాయి. దౌత్యం అంటే ఏంటో వాళ్లకి తెలియదు. యుద్ధాన్ని ముగించే ఉద్దేశం రష్యాకు లేదనే విషయం మరోసారి తేలిపోయిందని'' జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం.. రంగంలోకి ట్రంప్ మామ- బ్యాన్ చేయాలంటూ!
ఇదిలాఉండగా.. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పుతిన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వాళ్లు పలు నిర్ణయాలు కూడా తీసుకున్నారు. యుద్ధాన్ని విరమింపజేయడంలో భాగంగా ఉక్రెయిన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై నెలరోజుల పాటు దాడులు ఆపేయాలని ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ముందుగా ఈ రెండు రంగాల వరకు దాడులు ఆపేయాలని ట్రంప్ సూచనలు చేశారు. దీనికి పుతిన్ కూడా అంగీకరించినట్లు ట్రంప్ అధ్యక్ష కార్యాలయం పేర్కొంది. కానీ ఉక్రెయిన్ మాత్రం రష్యా తమపై దాడులు చేస్తూనే ఉందని ఆరోపిస్తోంది.
russia-ukraine-war | russia | ukraine | zelensky | telugu-news