/rtv/media/media_files/2025/02/24/jIJIDko8kTqwJdJbzPvz.jpg)
Russia launches fierce attacks on Ukraine
Russia vs Ukraine: రష్యా మరోసారి రెచ్చిపోయింది. ఉక్రెయిన్‌పై భీకర దాడులతో విరుచుకుపడింది. ఆదివారం 267 డ్రోన్లు ప్రయోగించగా సగానికి పైగా డ్రోన్లను కూల్చేసినట్లుగా ఉక్రెయిన్ ప్రకటించింది. గత వారం వ్యవధిలో 1150 డ్రోన్లు, 1400కు పైగా గైడెడ్ ఏరియల్ బాంబులు, 35 క్షిపణులు ప్రయోగించిందని జెలెన్‌స్కీ తెలిపారు.
ఇది కూడా చదవండి: Uganda-Indian Woman:లంచం ఇచ్చాకే నీళ్లు, ఫుడ్. జైలు కష్టాలను గురించి చెప్పకొచ్చిన భారత బిలియనర్ కుమార్తె
ఒకవైపు చర్చలు మరోవైపు దాడులు..
ఈ మేరకు రేపటితో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు మూడేళ్లు గడవనుంది. ఒకవైపు ఇరుదేశాల మధ్యవర్తిత్వ చర్చలు జరుగుతున్నప్పటకీ మరోవైపు దాడులు మాత్రం ఆగట్లేదు. బాంబులు, డ్రోన్లు, క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తున్నాయి. అయితే రష్యా దండయాత్రకు మూడేళ్లు పూర్తవుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ లో శాంతి నెలకొంటుందంటే అధ్యక్ష పదవిని వదులుకుంటానన్నాడు. అయితే ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. జెలెన్‌స్కీని నియంత అంటూ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాను నియంతను కాదని, రాజీనామా చేయడానికి వెనకాడట్లేదన్ని చెప్పారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh Assembly : నేడు AP బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీకి జగన్..?
ఈ సందర్భంగా అమెరికా- ఉక్రెయిన్‌ల మధ్య ఖనిజ నిక్షేపాల ఒప్పంద ప్రక్రియ ముందుకు సాగుతోందన్నారు. సహజ వనరులను పంచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రష్యా తమపై దాడి చేయకుండా అమెరికా అవసరం కావాలన్నారు. యుద్ధం ముగించేందుకు భద్రతా హామీలపై చర్చించేందుకు ప్రపంచ నేతలు ఉక్రెయిన్‌కు వస్తున్నారని చెప్పారు. ఇదొక కీలక మలుపుగా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు జెలెన్ స్కీ తెలిపారు.