/rtv/media/media_files/2025/01/15/kRN0bTH2TLdwVxSjm3Ge.jpg)
Fighter Jets
నిన్న రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. దాదాపు 14 క్షిపణులు, 200 డ్రోన్లతో రష్యాపై విరుచుకుపడింది. కెమికల్ ఫ్యాక్టరీలు, విద్యుత్తు కేంద్రాలను లక్ష్యంగా అటాక్ చేసింది. దీనికి ప్రతీకారంగా ఈరోజు ఉక్రెయిన్ మీద రష్యా దాడులు నిర్వహించింది. పోలాండ్ సరిహద్దుల్లో రష్యా క్షిపణులు విరుచుకుపడ్డాయి. గ్యాస్, ఎరువుల సరఫరా కేంద్రాలే లక్ష్యంగా చేసుకొని మాస్కోకు చెందిన ఏడు టీయూ-22, ఆరు టీయూ-95 స్ట్రాటజిక్ బాంబర్లు బాంబు దాడులు చేశాయి.
అడ్డుకున్న ఉక్రెయిన్..
అయితే వీటిలో చాలా వాటిని ఉక్రెయిన్ సమర్ధవంతంగా ఎదుర్కొంది. మొత్తం రష్యా 40 క్షిపణులను ప్రయోగించగా అందులో 30 నేలకూల్చామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. అవి కాకుండా మరో 70 కూడా అటాక్ చేశాయని తెలిపారు. అయితే తమ ఎయిర్ డిఫెన్స్‌లు వెంటనే యాక్టివేట్ అవడంతో వాటిని అడ్డుకోగలిగామని చెప్పారు. అయితే నాటూ మిత్రదేశాలు ఇచ్చిన హామీలు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని...ఎయిర్ డిఫెన్స్‌ను మరింత వేగం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Job Callender: నిరుద్యోగులను గుడ్ న్యూస్.. జాబ్ క్యాలెండర్ విడుదల!
మరోవైపు ప్యోంగ్యాంగ్ అణ్వాయుధాలు, ఉపగ్రహ కార్యక్రమాలకు రష్యా సాంకేతిక సహాయం చేసినందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్‌తో పోరాడటానికి రష్యాకు సహాయం చేయడానికి ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ 10,000 మందికి పైగా సైనికులను పంపారని దక్షిణ కొరియా వివరించింది. అయితే, వారికి ఆధునిక యుద్ధం గురించి అవగాహన లేకపోవడంతో వారిని "ఫిరంగి దాణా"గా ఉపయోగిస్తున్నారు, దీనివల్ల అధిక సంఖ్యలో ప్రాణనష్టం సంభవించిందని NIS విశ్లేషణలో తెలిపింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్‌స్కీ కైవ్ ఇద్దరు ఉత్తర కొరియా సైనికులను బంధించారని, వారిని విచారిస్తున్న వీడియోను విడుదల చేశారని చెప్పారు. రష్యాలో బందీలుగా ఉన్న ఉక్రెయిన్ సైనికులకు బదులుగా కిమ్ జోంగ్ ఉన్ సైనికులను అప్పగించడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని జెలెన్స్కీ అన్నారు.
ఇది కూడా చదవండి: కుంభమేళలో ఈ బ్యూటీ సాధ్వి కాదు.. ఎవరీ హర్ష రిచారియా..?