భారీగా పడిపోయిన రూపాయి విలువ.. ఇబ్బంది లేదంటున్న నిర్మలా సీతారామన్

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పడిపోతూ వస్తోంది. తాజాగా దీనిపై ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే డాలర్‌తో రూపాయి విలువ బాగానే ఉందని పేర్కొన్నారు.

New Update
Rupee doing fine compared to other Asian countries, Says Finance Minister Nirmala Sitharaman

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రూపాయి విలువ భారీగా పడిపోతూ వస్తోంది. దీంతో కేంద్రంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ తాజాగా దీనిపై ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. భారత్‌ ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే డాలర్‌తో రూపాయి విలువ బాగానే ఉందని పేర్కొన్నారు. లోక్‌సభలో రూపాయి క్షీణతపై అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. భారత ద్రవ్యలోటు నిర్వహణకు ప్రపంచదేశాలు కొనియాడుతున్నాయని అన్నారు. 

Also Read: రేపటి నుంచే జనగణన ప్రారంభం.. 33 ప్రశ్నలతో సమాచార సేకరణ

మన విదేశీ మారకపు నిల్వలు కూడా బలంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. కరెన్సీ విలువ తగ్గుతున్న పరిస్థితి కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదన్నారు. యుద్ధం మొదలైనప్పటినుంచి ప్రధాన ఆసియా కరెన్సీలు కూడా క్షీణించినట్లు పేర్కొన్నారు. థాయ్‌లాండ్ బాట్, సౌత్ కొరియా వోన్, ఫిలిప్పీన్ పెసో లాంటి కరెన్సీలను డాలర్‌తో పిల్చి చూస్తే రూపాయి కన్నా ఎక్కువగా పడిపోయినట్లు తెలిపారు. 

Also Read: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు, ఆయుధ నిల్వలు ధ్వంసం.. వీడియో షేర్ చేసిన ట్రంప్

మరోవైపు లోక్‌సభలో దివాలా స్మృతి సవరణకు ఆమోదం లభించింది. కోర్టు బయట పరిష్కారం, క్రాస్‌ బోర్డర్‌ దివాలా ప్రక్రియల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారు. 2016లో తీసుకొచ్చిన దివాలా స్మృతిలో 12 సవరణలు చేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనివల్ల వాటాదారులకు మంచి విలువ అందుతుందని.. పాలనా పక్రియ మెరుగుపడుతుందని పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు