/rtv/media/media_files/2026/05/02/iran-2026-05-02-21-07-56.jpg)
Representative of Iran's Supreme Leader in India calls current situation 'no war, no peace'
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆపడం కోసం ఇజ్రాయెల్, అమెరికాపై ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అయితే ప్రస్తుతం యుద్ధం లేని.. శాంతి లేని పరిస్థితి ఉందన్నారు. సాధారణ పరిస్థితులు నెలకోల్పాలంటే యుద్ధం ప్రారంభించిన వాళ్ల చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ యుద్ధం ఇరాన్ కోరుకోవడం లేదని తెలిపారు.
Also Read: ప్రభుత్వ పాఠశాలలో కలుషిత నీరు కలకలం.. 12 మంది విద్యార్థులకు అస్వస్థత
ఈ యుద్ధాన్ని నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేశామని అబ్దుల్ మాజిద్ తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతరం తమపై దాడులు చేయడం వల్లే మేము ప్రతిచర్యకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. చర్చల్లో పురోగతి ఉన్న సమయంలోనే తమపై భీకర దాడులు చేయడంతో సుప్రీం లీడర్ సహా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. చిన్నారులతో పాటు సామాన్యులు కూడా చనిపోయారన్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 4 వేల మంది చనిపోగా.. మరో 40 వేల మంది గాయపడ్డారని పేర్కొన్నారు. అలాగే చాలావరకు మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు.
మమ్మల్ని లొంగిపోవాలంటూ అమెరికా, ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తున్నట్లు మండిపడ్డారు. దీన్ని ఎవరూ అంగీకరించరని తేల్చిచెప్పారు. యుద్ధంపై పరిష్కార మార్గాల కోసం ఈ ఘర్షణలను ప్రారంభించిన వాళ్లే యుద్ధాన్ని ఆపేలా ప్రపంచ దేశాలు సూచించాలని తెలిపారు. ఈ దాడుల వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చివేయడమే వాళ్ల ఉద్దేశమని.. కానీ ఇది ఎన్నటికీ జరగదని స్పష్టం చేశారు.
Follow Us