టైమ్ ట్రావెలింగ్ గురించి పుస్తకాల్లో చదవడం, సినిమాల్లో చూడడం తప్ప నిజజీవితంలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు అలా టైమ్ ట్రావెల్ మిషన్ ద్వారా గతంలోకో, భవిష్యత్తులోకో వెళ్లిన దాఖాలాలు లేవు.ఎందుకంటే అసలు టైమ్‌ట్రావెల్ మిషన్‌ని ఎవరూ కనిపెట్టింది లేదు. కానీ ఓ విమానం టైమ్ ట్రావెల్ మిషన్‌గా మారింది. అంతేకాకుండా అందులో ఉన్న ప్రయాణికులందరినీ 2025 నుంచి 2024కు తీసుకెళ్లి ఆశ్చర్యపరిచింది. అసలు ఇదెలా సాధ్యం అయింది, ఆ కథేంటో ఇక్కడ చదివేద్దాం. Also Read: Bumrah: బుమ్రాకు అరుదైన గౌరవం.. టెస్టు టీమ్ ఆఫ్‌ది ఇయర్ కెప్టెన్! Hong Kong Flight Take Off In 2025 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు 2024 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పాయి. ఈక్రమంలోనే ప్రజలంతా పార్టీలు చేసుకుంటూ తెగ సందడి చేస్తున్నారు. అయితే భౌగోళిక పరిస్థితుల కారణంగా కొన్ని దేశాల్లో సమయం ముందూ వెనక ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే దేశాల మధ్య కొన్ని గంటల సమయం తేడా ఉంటుంది. అలా ఒక్కో దేశంలో జనవరి ఒకటి ముందే రావడం... మరికొన్ని దేశాల్లో కొంచెం ఆలస్యం అవ్వడం కామనే! Also Read: Jeju Air plane crash: జెజు విమాన ప్రమాదం వెనుక నార్త్ కొరియా హస్తం..? సరిగ్గా ఇదే జరిగి 2025 నుంచి 2024కు వెళ్లారు కొందరు విమాన ప్రయాణికులు. అన్ని దేశాల మాదిరిగానే హాంగ్ కాంగ్ భారతదేశం కంటే సుమారు ఓ మూడు గంటల ముందు ఉంటుంది. అలాగే అమెరికాలోని లాస్ ఏంజిల్స్ మధ్య భారత్ దేశంతో పోలిస్తే సుమారుగా 13 గంటల తేడా ఉంటుంది. ఇలా లాస్ ఏంజిల్స్‌లో అప్పటికీ ఇంకా న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభం కూడా కాలేదు. కానీ హాంగ్ కాంగ్‌లో వేడుకలు పూర్తయి మధ్యాహ్నం కూడా వచ్చేసింది. Also Read: Maoists: సీఎం ఫడ్నవీస్ ముందు లొంగిపోయిన 11 మంది మావోయిస్టులు ఈ రెండు దేశాల మధ్య మొత్తం 16 గంటల తేడా ఉండగా.. హాంగ్ కాంగ్ నుంచి నిన్న ఉదయం ఓ విమానం లాస్ ఎంజిల్స్‌కు బయల్దేరి వెళ్లింది.CPA880 నెంబర్ గల విమానం కొన్ని గంటల ప్రయాణం తర్వాత ఈరోజు లాస్ ఏంజిల్స్‌లో దిగింది. అయితే అమెరికా సమయం ప్రకారం అక్కడ ఇంకా 2024లోనే ఉన్నారు. ఇలా 2025లో విమానం ఎక్కిన ప్రయాణికులు అంతా 2024 తిరిగి రావడంతో తెగ ఆశ్చర్యపడ్డారు. Also Read: Traffic Rules: 17,800 వాహనాలు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన.. రూ.89 లక్షల ఫైన్ ఇది నిజంగానే టైమ్ ట్రావెల్ మిషన్ అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు పెట్టారు. నాక్కూడా అలా మళ్లీ గతేడాదికి వెళ్లాలని ఉందని కొందరు తమ మనుసులోని భావాలను కామెంట్ల రూపంలో చెబుతుండగా.. అయితే మరో ఏడాది వరకు వేచి చూడాల్సిందేనని మరి కొందరు నెటిజెన్లు ఫన్నీగా రిప్లై ఇచ్చారు.