/rtv/media/media_files/2025/01/22/TCUTm10W3mt5Zc1nkVOm.jpg)
trump putin
రష్యాతో యుద్ధానికి సంబంధించి ఇటీవల అమెరికా ఉక్రెయిన్ తో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఈ చర్చల్లో 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది.ఈ ఒప్పందం పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా స్పందించారు. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి పుతిన్ అనుకూలంగా మాట్లాడారు.
Also Read: Train Hijack: రైలు హైజాక్ వెనుక భారత్ హస్తం.. పాక్ ఆరోపణలు
అయితే ఈ కాల్పుల విరమణ అనేది శాశ్వత శాంతికి దారితీయాలని,సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించాలన్నారు.దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ..రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేసినప్పటికీ..ఒప్పందం ఇంకా కార్యరూపం సంతరించుకోలేదని అన్నారు.
Also Read:Bsnl Cheapest Recharge Plan: ఓరి దేవుడా.. రూ.750లకే 6 నెలల వ్యాలిడిటీ- 180 GB డేటా కూడా!
యుద్ధాన్ని నిలిపివేయాలనే ప్రతిపాదనలను మేం అంగీకరిస్తున్నాం.అయితే ఈ విరమణ అనేది దీర్ఘకాలిక శాంతికి దారి తీసేలా ఉండాలి. సంక్షోభ మూలాలను తొలగించేలా ఉండాలని పుతిన్ అన్నారు. అంతకుముందు పుతిన్ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకోతో క్రెమ్లిన్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా యుద్ధాన్ని ముగించేందుకు యత్నిస్తున్న ట్రంప్ యత్నాలకు కృతజ్ఙతలు తెలిపారు.
కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిపాదన అనేది సరైందే.మేము దానికి మద్దతు ఇస్తాం.అయితే ఈ విషయంలో కొన్నిసమస్యలు ఉన్నాయి. వీటి పై చర్చించాలి. దీని పై అమెరికాతో మాట్లాడాల్సిన అవసరం ఉందని పుతిన్ అన్నారు. ఈ విషయం పై ట్రంప్ నకు తానుఫోన్ చేసే అవకాశం ఉందన్నారు. శాంతియుత మార్గాల ద్వారా ఈ సంక్షోభానికి ముగింపు పలకాలనే ఆలోచనకు తమ మద్దతు ఉంటుందన్నారు.
శ్వేత సౌధంలో నాటో చీఫ్ మార్క్ రూటేతో ట్రంప్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రిపోర్టర్లు పుతిన్ వ్యాఖ్యల పై స్పందన కోరారు. దీని పై ట్రంప్ మాట్లాడుతూ..పుతిన్ చాలా ఆశాజనకమైన ప్రకటన చేశారు.అయితే ఇది ఇప్పుడే పూర్తి కాలేదు. ఈ విషయానికి సంబంధించి పుతిన్ ను నేరుగా కలవడం లేదా ఫోన్లో మాట్లాడతానని పేర్కొన్నారు.
ఏదేమైనా దీన్ని త్వరగా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది.తుది ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో చర్చలు నడిచాయి. రష్యా దీని పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.ఒకవేళ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆ దేశం తిరస్కరిస్తే ఇది ప్రపంచాన్ని తీవ్రంగా నిరాశ పరుస్తుంది.మేము చీకట్లో చర్చలు జరపట్లేదు.ఉక్రెయిన్ కోల్ఓపయి, తీసుకునే భూభాగాల గురించి చర్చిస్తున్నాము.ఇందులో అతిపెద్ద విద్యుత్ ప్లాంట్ సైతం ఉంది.
ఇది ఎవరికి చెందుతుందో చూడాలని ట్రంప్ అన్నారు. అయితే ట్రంప్ నేరుగా ఆ పవర్ ప్లాంట్ పేరు చెప్పకపోయినప్పటికీ ..అది జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం అనే విషయం తెలుస్తోంది.ప్రస్తుతం అది రష్యా అధీనంలోకి వెళ్లింది.యూరప్ లోని జపోరిజియా అతిపెద్ద అణు విద్యుత్‌కేంద్రం. మరో వైపు ఉక్రెయిన్ విషయం తేల్చడానికి అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ మాస్కోకు వెళ్లారు.
Also Read:Accident: నిర్మలా సీతారామన్‌కు బిగ్ షాక్.. చెన్నై కారు ప్రమాదంలో కుటుంబ సభ్యుడు అరెస్టు!
Also Read: AP News: బీసీలకు సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.20 వేలు..!