/rtv/media/media_files/2025/02/14/locqYEiyuOiliQfaHEmk.jpg)
PM Modi’s response to question on Gautam Adani bribery case in US
Gautam Adani Case: ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం అదానీ గ్రూప్‌పై అమెరికాలో కేసు నమోదు కావడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రధాని మోదీ - ట్రంప్ భేటీ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చిందా అనేదానికి ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే అక్కడి మీడియా వాళ్లు మోదీని దీనిపై ప్రశ్నించారు. దీనికి ప్రధాని తనదైన శైలీలో స్పందించారు. వ్యక్తిగత స్థాయి అంశాలు చర్చించరని చెప్పారు.
'' భారత్ ప్రజాస్వామ్య దేశం. మా సంస్కృతి వసుదైక కుటుంబం. ప్రపంచం అంతా మా కుటుంబంగా భావిస్తాం. ప్రతి భారతీయుడిని మా వాడిగానే అనుకుంటాం. ఇద్దరు దేశాధినేతలు ఎప్పుడూ కూడా వ్యక్తిగత స్థాయి అంశాలను చర్చించరు'' అని ప్రధాని మోదీ సమాధానమిచ్చారు. అంతేకాదు అదానీపై జో బైడెన్ కార్యవర్గ వైఖరిని తప్పుబడుతూ ఆరుగురు అమెరికా చట్టసభ సభ్యులు అటార్నీ జనరల్ పామ్ బోండికి లేఖలు కూడా రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Finally!
— Saket Gokhale MP (@SaketGokhale) February 14, 2025
PM Modi is FORCED to do a press conference in the US - something he hasn’t done in India in 11 years.
THIS is why he NEVER takes press questions in India.
THIS is why his “interviews” in India are fully scripted.
He’s so ANGRY & FLUSTERED 👇pic.twitter.com/sG2cfdKCq8
Also Read: న్యూ ఇండియా కో ఆపరేటివ్ బ్యాంకుకు బిగ్ షాక్.. కార్యకలాపాలు నిషేధించిన ఆర్బీఐ
అయితే అమెరికాలో ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానంపై విపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని తన స్నేహితుడిని కాపాడుకుంటున్నారని ఎక్స్ వేదికగా విమర్శించారు. '' దేశంలో ప్రశ్నలు అడిగితే మౌనం, విదేశాల్లో అడిగితే మాత్రం అది వ్యక్తిగత విషయం. అమెరికాలో మోదీ అదానీ చేసిన అవినీతిని దాస్తున్నారు. మిత్రుడి జేబు నింపడం మోదీకి జాతి నిర్మాణం అవుతుంది. లంచాలు ఇవ్వడం, జాతి సంపందను దోచుకోవడం వ్యక్తిగత అంశాలుగా మారిపోతాయని'' రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ఇదిలాఉండగా.. 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించేలా అధిక ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసే ఏపీ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నత స్థాయి వర్గాలకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎఫ్‌సీపీఏ కింద అమెరికాలో పలువురిపై కేసు నమోదైంది. ఆ నిధులను అమెరికాలో పెట్టుబడి కింద అదానీ గ్రూప్ సమీకరించింది. దీంతో అదానీ గ్రూప్‌పై కూడా కేసు నమోదు కావడం అప్పట్లో దుమారం రేపింది.
Also Read: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్!
సౌర విద్యుత్ విక్రయ కాంట్రాక్టులో అనుకూల షరతులను అమలుచేసేందుకు అదానీ గ్రూప్ 250 మిలియన్ డాలర్లు (రూ.2029 కోట్లు) లంచాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. అయితే విదేశీ సంస్థలపై చర్యలు తీసుకునే 1977 ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (FCPA) అమలను ట్రంప్ అధికారంలోకి వచ్చాక నిలిపివేశారు. దీంతో ఈ కేసులో అదానీ గ్రూప్‌ను భారీ ఊరట కలిగింది.