/rtv/media/media_files/2026/04/16/asim-munir-2026-04-16-11-23-19.jpg)
Pakistan's Asim Munir Carries Fresh US Message to Revive Iran Talks
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇటీవల అమెరికా-ఇరాన్(iran us war) మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో రెండోసారి కూడా చర్చలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బుధవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆయన పర్యటిస్తుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా ప్రభుత్వం పంపిన ఓ ముఖ్యమైన సందేశాన్ని ఇరాన్ అగ్రనేతలకు చేరవేసేందుకు మనీర్ ఇరాన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.
Also Read: ''మీ నౌకలను ముంచేస్తాం''.. అమెరికాకు ఇరాన్ సంచలన వార్నింగ్
Pakistan's Asim Munir Carries Fresh US Message
చర్చలకు సంబంధించి అమెరికా అందించిన ప్రతిపాదనలను అసిమ్ మునీర్ ఇరాన్‌తో పంచుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇరాన్ దీనిపై సానుకూలంగా స్పందిస్తే త్వరలోనే ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. తదుపరి రౌండ్ చర్చలకు మార్గం సుగమం చేసేందుకే అసిమ్ మునీర్ ఇరాన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈసారి కూడా ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ కూడా ఇరాన్‌తో రెండోసారి చర్చలు ఉంటాయని ప్రకటించారు.
Also Read: దారుణం.. పాఠశాలలో కాల్పులు.. 9 మంది మృతి
ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య రెండువారాల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 21తో ఈ గడువు ముగియనుంది. అయితే ఈ గడువు ముగిసేలోపే రెండోసారి చర్చలు జరపాలని చూస్తున్నారు. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే పశ్చిమాసియాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే అవకాశం ఉంటుంది.
Follow Us